అంతర్జాతీయం

ఐరాస పాలస్తీనా ఏజెన్సీ చీఫ్‌కు ఉద్వాసన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలెం, నవంబర్ 6: పాలస్తీనా శరణార్థులకోసం పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఏజెన్సీ అధినేత తన పదవి నుంచి తప్పుకున్నారు. ఏజెన్సీ నిర్వహణలో చోటు చేసుకున్న అక్రమాలపై సంస్థాగత విచారణ కొనసాగుతున్నందున అతడిని తాత్కాలికంగా పదవి నుంచి తప్పించినట్టు ఏజెన్సీ పేర్కొంది. యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏగా పేరు పొందిన ఐరాస ఏజెన్సీ కమిషనర్ జనరల్ పిర్రె క్రాహెన్‌బుహుల్ తాత్కాలికంగా తన పదవి నుంచి తప్పుకున్నారు. ఏజెన్సీ తాత్కాలిక డిప్యూటి చీఫ్ క్రిస్టియన్ సౌండర్స్ తాత్కాలికంగా కమిషనర్ జనరల్ బాధ్యతలను స్వీకరిస్తారని ఆ సంస్థ వివరించింది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో నిర్వహణకు సంబంధించిన అక్రమాలు వెలుగు చూశాయని, అవి ప్రత్యేకంగా కమిషనర్ జనరల్‌కు సంబంధించినవని ఏజెన్సీ తెలిపింది. ఈ వ్యవహారంపై విచారణ పూర్తయ్యేంత వరకు కమిషనర్ జనరల్ పిర్రె క్రాహెన్‌బుహుల్ తన పదవిలో కొనసాగబోరని ఏజెన్సీ పేర్కొంది. ఏజెన్సీలోని ఉన్నత స్థాయిలో నిర్వహణలో అక్రమాలు, అధికార దుర్వినియోగం చోటు చేసుకున్నట్టు అంతర్గత నైతిక నివేదిక వెల్లడించింది. అమెరికా అందజేసే నిధుల్లో కోత విధించిన తరువాత ఐరాసకు చెందిన ఆ సంస్థ ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంది. రహస్య నివేదికలో పేర్కొన్న ఆరోపణలపై ఐరాస ఇనె్వస్టిగేటర్లు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ రహస్య నివేదిక ప్రతి ఒక వార్తాసంస్థకు అందింది.