అంతర్జాతీయం

డెంగ్యూ కోరల్లో పాకిస్తాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌ను ఈ సంవత్సరం డెంగ్యూ వ్యాధి గతంలో ఎన్నడూ లేనంతగా పీడిస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు దేశంలో 44వేల మందికి ఈ వ్యాధి సోకిందని ఒక సీనియర్ ఆరోగ్య శాఖ అధికారి బుధవారం వెల్లడించారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం డెంగ్యూ వ్యాధి బాగా ప్రబలిందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్)లో సీనియర్ అధికారి డాక్టర్ రాణా సఫ్దర్ తెలిపారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వ్యాధి ఆసియాలోని ఇతర ప్రాంతాలలోనూ ఉందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో గతంలో 2011లో అధికంగా 27వేల మందికి డెంగ్యూ వ్యాధి సోకిందని, ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోయిందని, ఈ సంవత్సరం 44వేల మందికి ఈ వ్యాధి సోకిందని ఆయన వివరించారు. 2019లో ఇప్పటి వరకు ఈ వ్యాధి కారణంగా 66 మంది మృతి చెందారని ఆయన చెప్పారు. 2011లో దేశంలో డెంగ్యూ కారణంగా 370 మంది మృతి చెందినట్టు ఆయన గుర్తుచేశారు. వాతావరణ మార్పుయే ఈ వ్యాధి ప్రబలడానికి కారణమని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆయన దాని గురించి అంతకు మించి వివరించలేదు. ఈ సమస్యను నియంత్రించడానికి ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగిస్తోందని ఆయన పేర్కొన్నారు. పంజాబ్‌లో, ఇస్లామాబాద్‌లో స్థానిక అధికారులు నీటి నిల్వలను మూసి ఉంచడం, డెంగ్యూ నిరోధక రసాయనాలను చల్లడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని డాక్టర్ మహ్‌సీమా సిద్దిఖీ అనే వైద్యుడు ఆరోపించారు.