అంతర్జాతీయం

షార్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 8: వరుస రాకెట్ విజయాలతో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్ ) ప్రపంచ దేశాలలోనే మంచి గుర్తింపు సంపాదించుకొంది. ఇక్కడి నుండి ప్రయోగించే ప్రతి రాకెట్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది కావడం ఒకటైతే వినూత్న ప్రయోగాలు చేపట్టి మన శాస్తవ్రేత్తలు ప్రపంచ దేశాలకు దీటుగా నిలుస్తున్నారు. అంతేకాకుండా తక్కువ ఖర్చుతో భారీ ప్రయోగాలు చేపట్టడం వల్ల వాణిజ్య పరంగా ఇతర దేశాల నుండి కాసుల వర్షం కురుస్తోంది. ఇన్‌శాట్-3డి ఆర్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ప్రతిష్ఠ మరింత ఇనుమడించింది. శాస్తవ్రేత్తల ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇప్పటి వరకు షార్ నుండి మొత్తం 9 జిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు జరిగాయి. ఇది 10వ ప్రయోగం కావడమే కాకుండా స్వదేశీ క్రయోజనిక్‌తో ఉపగ్రహ ప్రయోగం చేపట్టి దిగ్విజయం చేశారు. చిన్న రాకెట్లతో మొదలు పెట్టి బుడిబుడి అడుగులు వేసిన ఇస్రో శాస్తవ్రేత్తలు నేడు భారీ ప్రయోగాల వైపు పరుగులు తీసే స్థాయికి చేరారు. గతంలో కల్పన, ఇన్‌శాట్ 3ఎ ఉపగ్రహాలను కూడా ఇదే తరహాలో విజయవంతంగా ప్రయోగించారు.