అంతర్జాతీయం

న్యుమోనియాకు బాల్యం బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, నవంబర్ 12: అత్యంత ప్రమాదకరమైన ప్రాణాంతక న్యుమోనియా వల్ల ప్రతి 39 సెకన్లకు ఓ వ్యక్తి బలవుతున్నాడని అంతర్జాతీయ ఆరోగ్య శిశు పరిరక్షణ ఏజన్సీలు హెచ్చరించాయి. న్యుమోనియా గురించి ఇటీవలి కాలం లో ఎలాంటి ప్రచారం లేకపోయినా కూడా ఇదో సైలెంట్ కిల్లర్‌గా పరిణమిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాధిని నిరోధించడం లేదా నివారించడం అసాధ్యమేమీ కాదని పేర్కొన్న ఈ ఏజన్సీలు గత ఏడాదిలోనే ఐదు సంవత్సరాలలోపు పిల్లలు లక్షల సంఖ్యలోనే మరణించారని, వీరి సంఖ్య 8 లక్షలకు పైనే ఉంటుందని తెలిపాయి. ఇతర వ్యాధుల కంటే కూడా న్యుమోనియా వల్లే అత్యధిక స్థాయిలో ప్రతిరోజూ మరణాలు సంభవిస్తున్నాయని ‘ప్రపంచ న్యుమోనియా డే’ సందర్భంగా ఈ సంస్థలు తెలిపాయి. ప్రతిరోజూ 2200 మంది ఐదేళ్లలోపు పిల్లలు ఈ వ్యా ధికి బలవుతున్నారని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రికా ఫోరే తెలిపారు. ఈ వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించాలంటే రోజువారీగా సంభవిస్తున్న మరణాలను నివారించాలంటే ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా ముందుకు రావాలని అన్నారు. వ్యాధి నిరోధక చర్యలపై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి తదుపరి పరిశోధనలు సాగించడం తక్షణావసరమని పిలుపునిచ్చారు. ఈ చర్యలను వెంటనే ప్రపంచ దేశాలు చేపడితే లక్షలాది మంది పిల్లల ప్రాణాలను రక్షించగలుగుతామని, అలాగే చౌకగా కూడా చికిత్సలు అందించే అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. గత ఏడాది డయేరియా కారణంగా 4,00,037 మంది ఐదేళ్లలోపు పిల్లలు, మలేరియా కారణంగా 2,00,072 మంది మరణించారని అన్నారు. ఈ రెండు వ్యాధులకు మిం చిన స్థాయిలో న్యుమోనియా పిల్లల పాలిట ప్రాణాంతక వ్యాధిగా మారుతోందని హెచ్చరించారు. న్యుమోనియా కారణంగా భారత్‌లో 1,00,027 మంది, పాకిస్తాన్‌లో 58వేల మంది మరణించిన విషయాన్ని యునిసెఫ్ డైరెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగీల వల్ల వ్యాపించే న్యుమోనియా పిల్ల ల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని, ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోవడం వల్ల వారికి శ్వాస పీల్చడమే కష్టమవుతుందని తెలిపారు. ముఖ్యంగా తగిన రోగ నిరోధక శక్తిలేని పిల్లలు, అలాగే అత్యధిక స్థాయి కాలుష్యం ఉండే ప్రాంతాల్లో ఉండే పిల్లలు ఈ వ్యాధికి చాలా తేలికగా గురయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించారు. సకాలంలో ఈ వ్యాధిని గుర్తిస్తే అది ప్రాణాంతకం కాకుండా నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు. మిగతా వ్యాధుల గురించి జరుగుతున్నంత ప్రచారం న్యుమోనియా వ్యాధి గురించి లేదని, దీని తీవ్రతే ఎక్కువ అన్న విషయం యూకేకు చెందిన సేవ్ ద చిల్డ్రన్ డైరెక్టర్ కెవిన్ వాట్ కిన్స్ తెలిపారు.