అంతర్జాతీయం

ఉగ్రభూతాన్ని వదిలిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రసిలియా, నవంబర్ 14: అభివృద్ధి, శాంతి, సంపదలకు ఉగ్రవాదం పెనుముప్పుగా పరిణమిస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఉగ్రభూతం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ట్రిలియన్ డాలర్ల మేర అపారమైన నష్టం వాటిల్లుతోందని గురువారం ఇక్కడ జరిగిన 11వ బ్రిక్స్ దేశాల సదస్సులో స్పష్టం చేశారు. బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా అధ్యక్షుల సమక్షంలో మాట్లాడిన మోదీ ప్రపంచ శాంతి, సౌభాగ్యం, అభివృద్ధిని హరిస్తున్న ఉగ్రవాదం వల్ల వృద్ధి రేటు 1.5శాతం తగ్గిపోయిందని తెలిపారు. ముఖ్యంగా వర్థమాన దేశాల పాలిట ఇది పెనుశాపంగా మారుతోందని, గత పదేళ్ల కాలంలోనే రెండు లక్షల 25వేల మంది ఈ జాడ్యానికి బలయ్యారని మోదీ ఈ శిఖరాగ్ర సదస్సులో వివరించారు. ఉగ్రవాదం వల్ల తలెత్తుతున్న భయోత్పాతం కారణంగా వ్యాపార, వాణిజ్యాలు ఘోరంగా దెబ్బతింటున్నాయని, సర్వత్రా అనుమానం, భయాలు ఆవహించాయని తెలిపారు. ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ఐదు బ్రిక్స్ దేశాల మధ్య భద్రతా పరంగా సహకారం మరింత పెంపొందాలన్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అనుసరించాల్సిన వ్యూహాలపై తొలి సెమినార్ జరగడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు. ఇలాంటి ప్రయత్నాలు మరింత బలంగా సాగితే ఉగ్రవాదాన్ని మరింత బలంగా ఎదుర్కోగలుగుతామన్నారు. పట్టణ ప్రాంతాల్లో సుస్థిర జల నిర్వహణ, పారిశుద్ధ్యం అన్నవి పెద్ద సవాళ్లుగా మారుతున్నాయని పేర్కొన్న మోదీ బ్రిక్స్ దేశాల జల వనరుల మంత్రుల తొలి సమావేశం భారత్‌లో జరగాలని సూచించారు. ఇటీవల భారత్‌లో ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించామని గుర్తు చేసిన మోదీ ఫిట్‌నెస్, ఆరోగ్య సంరక్షణ విషయంలో బ్రిక్స్ దేశాల ప్రజల మధ్య మరింత సాన్నిహిత్యం, సహకారం పెరగాలని సూచించారు. పరస్పర వాణిజ్యం, పెట్టుబడులపై కూడా ఈ ఐదు దేశాలు దృష్టి పెట్టాలని పేర్కొన్న మోదీ ‘ప్రపంచ జనాభాలో 40శాతం మంది ఈ ఐదు దేశాల్లోనే ఉన్నారు. కానీ వీటి మధ్య వాణిజ్యం మాత్రం కేవలం 15శాతమే ఉంది’అని తెలిపారు. బ్రిక్స్ కూటమిని ఏ విధంగా శక్తివంతంగా తీర్చిదిద్దాలో చర్చింది, రానున్న పదేళ్ల వ్యూహాన్ని రూపొందించాలని మోదీ సూచించారు. ఇప్పటికే అనేక రంగాల్లో ఈ దేశాలు ఎన్నో విజయాలు సాధించినప్పటికీ.. ఇంకా సహకారాన్ని విస్తరించుకోవడానికి ఎంతో ఆస్కారం ఉందన్నారు.
*చిత్రం... శిఖరాగ్ర సదస్సులో మాట్లాడుతున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ