అంతర్జాతీయం

మైనారిటీలే లక్ష్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 16: అస్సాంలో అమలు చేస్తున్న జాతీయ పౌర రిజిస్టరు (ఎన్‌ఆర్‌సీ) మతపరమయిన మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడానికి, ముస్లింలను ఏ దేశానికి చెందని వారిగా చేయడానికి ఉపయోగిస్తున్న పనిముట్టు అని అంతర్జాతీయ మతస్వేచ్ఛపై ఏర్పాటు చేసిన ఫెడరల్ యూఎస్ కమిషన్ ఆరోపించింది. అస్సాంలో నివసిస్తున్న భారతీయ పౌరుల పేర్లను పొందుపరుస్తూ రూపొందించిన ఎన్‌ఆర్‌సీ తుది జాబితాలో 19 లక్షల మంది నివాసితులకు చోటు దక్కలేదని యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్) శుక్రవారం పేర్కొంది. అనేక దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఎన్‌ఆర్‌సీ అస్సాంలోని బెంగాలీ ముస్లిం కమ్యూనిటీకి చెందిన ప్రజల హక్కులను హరించడమే లక్ష్యంగా ఏర్పడిన యంత్రాంగం అని ఆందోళన వ్యక్తం చేశాయని తెలిపింది. దీనివల్ల పౌరసత్వానికి మతపరమయిన అవసరం ఉందనే భావన నెలకొందని, ఫలితంగా పెద్ద సంఖ్యలో ముస్లింలను ఏ దేశానికి చెందని వారుగా చేస్తోందని పేర్కొంది. అస్సాంలోని నిజమయిన భారతీయ పౌరుల పేర్లను పొందుపరచడానికి ఉద్దేశించినదే ఎన్‌ఆర్‌సీ. సుప్రీంకోర్టు 2013లో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రిజిస్టర్‌ను తాజాపరిచే ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్రంలో ఉన్న 33 మిలియన్ల మంది ప్రజలు తాము భారతీయ పౌరులమని ధ్రువీకరించుకోవలసి ఉండింది.