అంతర్జాతీయం

కాలాపానీ ముమ్మాటికీ మాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, నవంబర్ 18: వివాదాస్పద కాలాపానీ ప్రాంతం నుంచి భారతదేశం వెంటనే తమ దళాలను ఉపసంహరించుకోవాలని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ డిమాండ్ చేశారు. తమ భూభాగంలోని ఒక్క అంగుళాన్ని కూడా అన్యాక్రాంతం కానివ్వమని, ఎవరు దురాక్రమణ చేసినా సహించేది లేదని ఆయన తెలిపారు. భారతదేశం ఇటీవల జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి మ్యాప్‌లను విడుదల చేసింది. అలాగే లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో గిల్‌జిత్-బాల్టిస్తాన్ ప్రాంతాలను చేర్చింది. అయితే, నేపాల్‌లోని కాలాపానీ ప్రాంతంలో కూడా భారత్ కొత్త పటంలో చేర్చారంటూ వచ్చిన కథనాలపై ఆ దేశా ప్రధాని ఓలీ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదాస్పద ప్రాంతం నుంచి భారత దళాలను తొలగించేందుకు తమ ప్రభుత్వం చర్యలను చేపడుతుందని అన్నారు. అయితే, భారత్ తనంతట తానుగానే సైనిక దళాలను ఉపసంహరించుకోవాలని ఓలీ కోరినట్టుగా నేపాల్ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. దౌత్య ప్రయత్నాల ద్వారానే కాలాపానీ సమస్యను పరిష్కరించుకునేందుకు తాము ప్రయత్నిస్తామని ఈ ప్రకటనలో ఓలీ స్పష్టం చేశారు. తమ దేశ సరిహద్దులను పరిరక్షించుకునే సామర్థ్యం తమకు ఉందని, ఈ ఆక్రమిత ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దేశంలోని అన్ని శక్తులూ ఒక్కతాటిపై నిలబడతాయని ఆయన తెలిపారు. ఈ వివాదాస్పద ప్రాంతం నుంచి భారత్ తమ సైనిక దళాలను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ ఇప్పటికే ఉద్యమాన్ని చేపట్టిన నేపథ్యంలో ప్రధానమంత్రి తీవ్ర స్వరంతోనే మాట్లాడారు. కాలాపానీ కూడా తమ దేశంలో అంతర్భాగమే అన్నట్టుగా భారతదేశం కొత్త పటాన్ని విడుదల చేయడం పట్ల నేపాల్‌లోని రాజకీయ పార్టీలన్నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కాలాపానీ ప్రాంతం నేపాల్ భూభాగంలో అంతర్భాగమేనని స్పష్టం చేస్తూ ఆ దేశ విదేశాంగ కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.