అంతర్జాతీయం

నీటి నిల్వల పరిరక్షణలో ఇజ్రాయెల్ భేష్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెల్ అవీవ్, నవంబర్ 19: నిటి నిల్వల పరిరక్షణ, నిర్వాహణలో ఇజ్రాయెల్ నంబర్ వన్‌గా నిలుస్తున్నదని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రశంసించారు. ఇజ్రాయిల్‌ను ఆయన ‘నీటి సూపర్ పవర్’గా అభివర్ణించారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ‘వాటర్ టెక్నాలజీ అండ్ ఎన్విరానె్మంటన్ కంట్రోల్ (డబ్ల్యూఏటీసీ)’ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నీటిని సక్రమంగా వినియోగించుకోవడం, నిల్వలను కాపాడుకోవడం, నీటి నిర్వాహణ వంటి అంశాల్లో ప్రపంచ దేశాలకు ఇజ్రాయిల్ మార్గదర్శకమని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా నీటి నిల్వలు దారుణంగా పడిపోతున్నాయని, ఇజ్రాయిల్‌లో మాత్రం అలాంటి పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఇక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే అందుకు కారణమని తెలిపారు. భారత్ కూడా నీటి వినియోగం విషయంలో ఇజ్రాయిల్‌తో కలిసి పని చేస్తుందని షెకావత్ ప్రకటించారు. రెండు దేశాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయని అన్నారు. విద్య, వైద్యం, వాణిజ్యం తదితర రంగాల్లోనూ ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని చెప్పారు. వాటిని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో అమలు చేస్తున్న పలు పథకాలను ఈ సందర్భంగా షెకావత్ వివరించారు.
*చిత్రం... హైఫా (ఇజ్రాయెల్)లోని మొదటి ప్రపంచ యుద్ధంలో మృతి చెందిన భారత జవాన్ల స్మృతి చిహ్నం వద్ద నివాళులు అర్పిస్తున్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్