అంతర్జాతీయం

అణ్వాయుధాలకు స్వస్తి పలకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగసకి, నవంబర్ 24: అణ్వాయుధాలకు పూర్తిగా స్వస్తి పలకాలని పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఊరేగింపులో పోప్ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోప్ ప్రసంగిస్తూ అణ్వాయుధాలు కలిగి ఉండడం కూడా నేరమని వ్యాఖ్యానించారు. అణ్వాయుధాల వల్ల కలిగే అనర్థాల గురించి చెబుతూ గత సంఘటనల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 1945 సంవత్సరంలో హిరోషిమాలో అణ్వాయుధం ప్రయోగంతో 145000 మంది మృత్యువాత పడ్డారని ఆయన చెప్పారు. మూడు రోజుల అనంతరం రెండవసారి వేసిన అణ్వాయుధ బాంబుతో 74 వేల మంది మృత్యుకూపంలోకి వెళ్ళారని ఆయన ఆవేదన చెందారు. అణ్వాయధం వల్ల కేవలం ఒక్క క్షణంలో పూర్తిగా విధ్వంసం జరుగుతుందని, నల్లని రంధ్రం ఏర్పడుతుందన్నారు. తమ వారిని కోల్పోయి ఈ తరం ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని ఆయన తెలిపారు. వేలాది మంది మరణం తర్వాత నెలకొన్న నిశ్శబ్దాన్ని ఛేదించాలన్నారు. అణ్వాయుధాలను ఉపయోగించడం ద్వారా ఇప్పుడే కాదు భవిష్యత్తుతరాలకూ అన్యాయం చేసినట్లు అవుతుందన్నారు. ఈ ఊరేగింపు జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన పుస్తకంలో పోప్ ఫ్రాన్సిస్ తొలుత సంతకం చేసి, తన సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు లిఖించారు. ఊరేగింపులో పాల్గొనేందుకు రాగానే ఆయనకు ఘన స్వాగతం లభించింది. నాడు మరణించిన వారికి స్మారకంగా నిర్మించిన స్థూపంపై పోప్ ఫ్రాన్సిస్ పువ్వులు ఉంచి నివాళి అర్పించారు.