అంతర్జాతీయం

నేపాల్‌లో రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మాండు: నేపాల్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. అర్గకాచి జిల్లాలో బుటావాల్ నగరం వైపు వెళుతున్న ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 8 మంది మహిళలు సహా 17 మంది మృతి చెందారని, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. సాంధిక్కార లోయ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనకు కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే దట్టంగా మంచు కురవడంతో దారి కనిపించక వాహనం అదుపు తప్పిందని అనుమానిస్తున్నారు.