అంతర్జాతీయం

కాబూల్‌లో ఉగ్ర దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 27: అఫ్గనిస్తాన్‌లోని కాబుల్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం (యుఎన్‌డిపీ)లో పని చేస్తున్న భారత సంతతికి చెందిన అమెరికన్ యుఎన్‌డీపీ నిపుణుడు అనిల్ రాజ్‌ను పొట్టన పెట్టుకున్నారు. కాలిఫొర్నియాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న అనిల్ రాజ్ అఫ్గనిస్తాన్‌లోని కాబుల్‌లో యుఎన్‌డిపీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా ఈ నెల 24న ఐక్యరాజ్య సమితికి చెందిన వాహనంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో అనిల్ రాజ్ మరణించాడు. ఈ దాడిలో మరో ఐదుగురు స్థానికులు, ఉద్యోగులు గాయపడ్డారని యుఎస్ సెక్రటరీ మైక్ పొంపియో మంగళవారం విలేఖరులకు చెప్పారు. మరణించిన అనిల్ రాజ్‌కు సంతాపం తెలిపారు. రాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. యూఎన్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గన్ ప్రజల బాగోగుల కోసం యూఎన్ పని చేస్తున్నదని తెలిపారు. ఈ దాడిని యుఎన్‌డిపీ తీవ్రంగా ఖండించింది.