అంతర్జాతీయం

టార్గెట్ 2020

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, నవంబర్ 27: చైనా ప్రభుత్వం జీవావరణ, పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. 2020 నాటికి కార్బన్ ఉద్ఘారాలను తగ్గించాలన్న లక్ష్యంతో కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు పర్యావవరణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన చేసింది. కార్బన్ ఉద్ఘారాలు తగ్గించేందుకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. 2005తో పోల్చుకుంటే తీవ్రత బాగా తగ్గింది. 2020 నాటికి కార్బన్ డయాక్రైడ్(సీఓ2) తగ్గించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు పర్యావరణ శాఖ సహాయ మంత్రి ఝావో యింగ్‌మిన్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 14.3 శాతం నాన్ ఫొస్సిల్ ఫ్యూయల్ వినియోగిస్తున్నట్టు ఆయన చెప్పారు.‘దీని వల్ల కార్బన్ ఉద్ఘారాలు పెరిగిపోతున్నాయి. పచ్చదనం కనుమరుగవుతోంది. శిలాజాయేతర ఇంధనం వల్ల దుష్ప్రరిణామాలే ఎక్కువ’అని మంత్రి తెలిపారు. అయితే ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 2000-18 మధ్య సానుకూలమైన మార్పులు వచ్చాయని, ఏటేటా కార్బన్ ఉద్ఘారాల ఉత్పత్తి తగ్గుతూ వచ్చిందని ఆయన వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన వెల్లడించారు. సోలాల్ ప్యానల్స్, పవన టర్బయిన్లు, విద్యుత్ వాహనాల వినియోగంలో ప్రపంచంలోనే చైనా ముందుందని ఆయన అన్నారు. సోలార్ సెల్స్ తయారీలో చైనా అగ్రస్థానంలో నిలిచింది. ‘ఇప్పటికీ మేం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాం. దేశాభివృద్ధికి అనేక అవరోధాలు ఉన్నాయి. ప్రజల జీవన విధానం మార్చాల్సి ఉంది. పరిసరాల శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంది’అని మంత్రి యంగ్‌మిన్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై పారిస్‌లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. బొగ్గుపులుసు వాయువు తగ్గించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అయితే పారిస్ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు అమెరికా ఇటీవలే ప్రకటించిందని ఆయన చెప్పారు. ట్రంప్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసిందని చైనా విమర్శించింది. ఒప్పందం ప్రకారం 2030 నాటికి కార్బన్ ఉద్ఘారాలు పూర్తిగా తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామని చైనా ప్రకటించింది. 2005 నుంచి తాము తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని ఈ సందర్భంగా పర్యావరణ మంత్రి తెలిపారు.