అంతర్జాతీయం

సరికొత్త ‘ఇన్నింగ్స్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, నవంబర్ 27: శ్రీలంక క్రికెట్‌లో ప్రఖ్యాత, లెజెండరీ స్పిన్నర్ అయిన ముత్తయ్య మురళీధరన్‌కు అరుదైన గౌరవం లభించింది. శ్రీలంక ఉత్తర ప్రావిన్స్‌కు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాలని అధ్యక్షుడు గోటబాయ రాజపక్స ప్రత్యేకంగా ఆహ్వానించారు. 47 సంవత్సరాల మురళీధరన్ టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు (800) తీసిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన సంగతి క్రికెట్ అభిమానులకు తెలిసిందే. లంక నూతన అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గొటబాయ రాజపక్స నియమించిన ముగ్గురు గవర్నర్‌లలో మురళీధరన్ ఒకరు కావడం విశేషం. రాజపక్స.. మురళీధరన్‌ను వ్యక్తిగతంగా ఆహ్వానించి.. తమిళ ప్రభావం ఎక్కువగా ఉన్న ఉత్తర ప్రావిన్స్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరినట్లు బుధవారం డైలీ మిరర్ పత్రిక ప్రచురించింది. మురళీధరన్‌ను గవర్నర్‌గా నియమించినట్లు సెక్రటేరియట్ వర్గాలు సైతం నిర్దారించాయి. ఈశాన్య ప్రావిన్స్‌కు అనురాధా యహంపత్, తిస్సా వితరాన నార్త్ సెంట్రల్ ప్రావిన్స్‌కు గవర్నర్‌లుగా నియమితులయ్యారు. కాగా, మురళీధరన్ చెన్నైకు చెందిన మధిమలర్ రామమూర్తిని 2005లో వివాహం చేసుకొన్నారు. టెస్టు క్రికెట్ నుంచి మురళీధరన్ 2010లో రిటైరైన సంగతి తెలిసిందే.