అంతర్జాతీయం

ఆసియా శతాబ్దికి భారత్-చైనా బంధమే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, నవంబర్ 30: ఈ శతాబ్దం ఆసియా ఖండానికి సొంతం కావాలంటే భారత్-చైనా ప్రాంతీయంగాను, అంతర్జాతీయంగాను బలమైన సహకార బంధాన్ని కొనసాగించాల్సి ఉంటుందని మేధావుల ఫోరం స్పష్టం చేసింది. కేవలం వ్యాపార, వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా అత్యధిక జనాభా కలిగిన ఈ రెండు దేశాలు బహుముఖీయ రీతిలో మైత్రిని విస్తరించుకోవాలని, అప్పుడే ఈ శతాబ్ది ఆసియాకు సొంతం అవుతుందని ఈ ఫోరం తెలిపింది. ఇరు దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ఈమేరకు తమ నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రెండు దేశాల మధ్య ఏఏ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందో ఇక్కడ జరిగిన రెండు రోజుల మేధోఫోరం చర్చ జరిగిన సందర్భంగా నిర్ధారించారు. ఇరు దేశాల మేధావుల ఫోరం సమావేశం కావడం ఇది నాలుగోసారి. శనివారం ముగిసిన ఈ సదస్సులో పాల్గొన్న వక్తలు భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సహకారం నేటి పరిస్థితుల్లో ఎంతైనా అవసరమని స్పష్టం చేశారు. 2015లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మేధావుల ఫోరం ఏర్పాటైంది. ఈ సమావేశాన్ని భారత అంతర్జాతీయ వ్యవహారాల మండలి, చైనా సామాజిక శాస్త్రాల అకాడమీ గత నాలుగేళ్లుగా ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి. ఆసియా శతాబ్ది లక్ష్యాన్ని సాధించాలంటే ఈ రెండు అతి పెద్ద దేశాలు సన్నిహితమైన రీతిలో అభివృద్ధి భాగస్వామ్యాన్ని కొనసాగించాల్సి ఉంటుందని ఈ సమావేశం స్పష్టం చేసింది. ఇరు దేశాల అభివృద్ధి వ్యూహంతోపాటు సాంస్కృతిక, నాగరిక అంశాల్లోనూ మరింతగా సహకారాన్ని ఇనుమడింజపజేసుకోవాలని ఈ ఫోరం స్పష్టం చేసింది. అరమరికలు లేని రీతిలో స్నేహపూర్వక వాతావరణంలో ఈ చర్చలు జరిగాయని అనంతరం ఇక్కడి భారత ఎంబసీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ చర్చల వల్ల రెండు దేశాల మధ్య అన్ని అంశాల్లోనూ లోతైన అవగాహన సాధ్యమైందని ఈ ప్రకటనలో వెల్లడించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇరుగుపొరుగు దేశాలైన భారత్-చైనా ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో కలసి పనిచేయడం అన్నది ఎంతైనా అవసరమని ఫోరంలో మాట్లాడిన దౌత్యవేత్తలు స్పష్టం చేశారు. ఈ రెండు దేశాల మధ్య ఎంతగా సన్నిహిత సంబంధాలు పెంపొందిస్తే అంతగానూ ఆసియా శతాబ్ది లక్ష్యాన్ని సాకారం చేసుకోవచ్చునని తెలిపింది. ఈ చర్చల్లో పాల్గొన్న భారత బృందంలో 15 మంది సభ్యులు ఉన్నారు.