అంతర్జాతీయం

మీ మైండ్ సెట్ మార్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, డిసెంబర్ 1: ‘మీ మైండ్ సెట్ మార్చుకోండి..’ అని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశ అధికారులకు సూచించారు. పాతకాలం నాటి విధానాలతో, పద్ధతులతో ‘నయా (కొత్త) పాకిస్తాన్’ ఎలా అవుతుందీ? అని ఆయన ప్రశ్నించారు. దేశాభివృద్ధిలో, ఆర్థిక పరిస్థితి మెరుగుదల, పెరుగుదలలో ఉద్యోగులు, అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందని ఆయన తెలిపారు. మెరిట్, అంకితమైన భావంతో పని చేసే ఉద్యోగులను కీలకమైన శాఖల్లో నియమించాలని ఆయన అధికారులకు సూచించారు. శనివారం జరిగిన పాక్ వివిధ శాఖల ఉన్నతాధికారుల, పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తూ పాత పద్ధతులను పట్టుకుని వేలాడితే దేశం అభివృద్ధి చెందదని అన్నారు. ఆ మర్నాడే ప్రధాని ఖాన్ 134 మంది ఉన్నతాధికారులను, పలువురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ప్రభుత్వ పని తీరును మెరుగుపరచాలని, శాంతి-్భద్రతలను పూర్తిగా కాపాడాలని ఆయన ఆదేశించారు. పోలీసులు ప్రజలకు రక్షణగా ఉండాలని ఆయన సూచించారు. పోలీసు స్టేషన్లపై లోగడ వివిధ రకాల వత్తిళ్ళు ఉండేవని అన్నారు. ప్రజల రక్షణే తమ కర్తవ్యంగా పోలీసులు పని చేయాలని ఆయన సూచించారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావీద్ భజ్వా పదవీ కాలాన్ని పొడిగించిన విషయంలో కోర్టు తలదూర్చడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కోర్టు విమర్శించం భావ్యం కాదన్నారు. ఆ వివాదం ఇప్పుడు సమిసి పోయిందని ఆయన చెప్పారు. ఇంకా ఈ విషయంపై ఎక్కువ మాట్లాడనని అన్నారు. అవినీతిని పూర్తిగా రూపుమాపాలని, అవినీతిపరులను జైలుకు పంపిస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు.

*చిత్రం...పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్