అంతర్జాతీయం

పర్యావ‘రణం’లో ఓడిపోతున్నాం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, డిసెంబర్ 12: పర్యావరణ మార్పులను నిరోధించి పుడమిని రక్షించుకునే ప్రయత్నాల్లో ప్రపంచ దేశాలు ఓడిపోతున్నాయంటూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గట్టెరాస్ హెచ్చరించారు. వెంటనే కర్బన వినియోగాన్ని గణనీయంగా తగ్గించే ఆర్థిక వ్యవస్థల దిశగా సాహసోపేత చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. దీని వల్ల 2030 నాటికి 26ట్రిలియన్ డాలర్ల మేర వృద్ధికి అవకాశం ఉంటుందని, 65 మిలియన్ మేర కొత్త ఉద్యోగాలనూ సృష్టించ వచ్చునని తెలిపారు. ఐక్యరాజ్య సమితి వార్షిక వాతావరణ శిఖరాగ్ర సదస్సునుద్దేశించి గురువారంనాడిక్కడ మాట్లాడిన ఆయన ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్‌కు పెరిగే అవకాశం ఉందనిః ఈ సదస్సుకు హాజరైన 197దేశాలను హెచ్చరించారు.
కర్బన వినియోగాన్ని తగ్గించుకునే ఆర్థిక వ్యవస్థలకు మారడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందన్న విషయం ఓ కీలక సర్వేలో వెల్లడైందని ఆయన తెలిపారు. ప్రజల మనుగడ, ఆరోగ్యం, ఉపాధి, విద్య, అన్నింటికీ మించి వారి భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ దేశాలు పర్యావరణ మార్పుల నిరోధానికి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. సౌర,పవన, జియోధెర్మల్‌ను వినియోగిస్తున్న దేశాలే అత్యధికంగా ఉపాధిని కల్పించగలుగుతున్నాయని, వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిపై వాతావరణ ప్రతికూల ప్రభావం పడుతోందని, టూరిజం, వ్యవసాయ రంగంపై ఆధార పడ్డ వారు ఉపాధిని కోల్పోతున్నారని అన్నారు. పారిస్ ఒప్పందంలో పొందుపరచుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ప్రపంచ దేశాలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని, 2050 నాటికి కర్బన తటస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి బలమైన బాటలు వేయాలని అన్నారు.