అంతర్జాతీయం

ముస్లింలకు వ్యతిరేకం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: భారత ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇక్కడి భారతీయ సంతతిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన విద్వేషం అన్నది దేశ సంస్కృతిలోనే లేదని స్పష్టం చేశారు. భారత్-అమెరికా మధ్య జరుగుతున్న 2+2 మంత్రిత్వ స్థాయి చర్చల్లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన రాజ్‌నాథ్ సింగ్ భారతీయ సంతతిని ఉద్దేశించి మాట్లాడారు. 370 రాజ్యాంగ అధికరణ రద్దు సహా నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని అణచివేయడంలో తమ ప్రభుత్వం అత్యంత సాహసోపేతమైన రీతిలో చర్యలు చేపట్టిందని వివరించారు. తాజాగా పౌరసత్వ సవరణ చట్టంపై దేశ విదేశాల్లోనూ తలెత్తుతున్న వ్యతిరేక ప్రదర్శలను ప్రస్తావించిన ఆయన ‘ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకమన్న వాదనలో అర్థం లేదు. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మత వేధింపుల కారణంగా భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, పార్శీలు, బౌద్ధులు, జైనులకు పౌరసత్వాన్ని కల్పిస్తోంది. ఇది ఎంతమాత్రం ముస్లింలకు వ్యతిరేకం కాదు’ అని ఉద్ఘాటించారు. పౌరసత్వ సవరణ చట్టంలో ఈ మూడు దేశాలకు చెందిన ముస్లిమేతరుల మైనారిటీలను మాత్రమే చర్చడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. ఈ మూడు కూడా ముస్లిం దేశాలని, అలాగే ఇస్లామిక్ దేశాలని పేర్కొన్న ఆయన ‘ఈ దేశాల్లో ఇస్లాం మతాన్ని పాటించేవారికి ఎలాంటి వేధింపులు ఉండవు. అందుకే భారత పౌరసత్వ చట్టంలో ముస్లింలను చేర్చలేదు’ అని హర్షధ్వానాల మధ్య వివరించారు. వసుధైక కుటుంబ భావనను ప్రపంచానికి చాటిచెప్పింది భారతదేశమేనని, ఈ దేశ సంస్కృతిలో విద్వేషమన్నదే లేదని ఉద్ఘాటించారు. విద్వేషాలను రెచ్చగొట్టడం వల్ల ప్రజలకు చేరువయ్యే అవకాశమే ఉండదని స్పష్టం చేశారు. భారతదేశంలో ముఖ్యంగా అస్సాం, బెంగాల్‌లో ఈ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనలపై మాట్లాడిన ఆయన ‘ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఈ చట్టంపై ఏర్పడ్డ గందరగోళాన్ని తొలగిస్తాం. అయితే, ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకమన్న వాదనలో ఎలాంటి పసా లేదు. ఒకవేళ ఇది ముస్లింలకు వ్యతిరేకమని స్పష్టమైతే దానిపై పునరాలోచనకూ సిద్ధమే’ అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. అయితే, ఎవరో ఆరోపించినంత మాత్రాన, వాస్తవాలను వక్రీకరించినంతమాత్రాన ఇది ముస్లింలకు వ్యతిరేకమన్నది నిజం కాబోదు అని ఆయన అన్నారు. పాకిస్తాన్‌తో చర్చలంటూ జరిగితే, అతి ఆక్రమిత కాశ్మీర్‌కే పరిమితమవుతాయని ఓ ప్రశ్నకు సమాధానంగా రాజ్‌నాథ్ వెల్లడించారు. అయితే, దీనిపై కూడా చర్చలు అవసరం లేదని, ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌లో అంతర్భాగమేనని ప్రజల హర్షధ్వానాల మధ్య అన్నారు. భారత సైనిక శక్తి అపారంగా పెరుగుతోందని పేర్కొన్న ఆయన పాకిస్తాన్‌తో వ్యవహరించేటపుడు కూడా అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నామని అన్నారు. నిజంగా భారత్ అనుకుంటే పాకిస్తాన్ సైనిక స్థావరాలపైన, పౌర ప్రాంతాలపైనా దాడి చేసి ఉండేదని, అయితే అలాంటి చర్య వల్ల అపారమైన ప్రాణనష్టానికి ఆస్కారం ఉంటుందని రాజ్‌నాథ్ అన్నారు. అందుకే ఇటీవల జరిపిన దాడుల్లో పాక్ ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు. భారత్-అమెరికా మధ్య బుధవారం జరుగనున్న 2+2 మంత్రిత్వ స్థాయి చర్చల్లో రాజ్‌నాథ్‌తోపాటు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా పాల్గొంటున్నారు.
*చిత్రం...రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్