అంతర్జాతీయం

ట్రంప్‌ను అభిశంసించిన అమెరికా ప్రతినిధుల సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికా చరిత్రలో అభిశంసనకు గురయిన మూడో దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, కాంగ్రెస్‌ను అడ్డుకుంటున్నారని అమెరికా ప్రతినిధుల సభ లాంఛనంగా అభియోగాలు చేసింది. దీంతో వచ్చే సంవత్సరం సెనేట్ విచారణ జరుగనుంది. ట్రంప్ తరువాత మూడేళ్లు అధ్యక్ష పదవిలో కొనసాగుతారా? దిగిపోవాల్సి వస్తుందా? అనేది సెనేట్ విచారణ నిర్ణయిస్తుంది. ప్రతినిధుల సభ బుధవారం రాత్రి అధ్యక్షుడు ట్రంప్‌ను రెండు అంశాలపై అభిశంసించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది ఒకటి కాగా, కాంగ్రెస్‌ను అడ్డుకుంటున్నారనేది రెండోది. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చేసిన అభిశంసనకు అనుకూలంగా 230 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 197 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ను అడ్డుకున్నారనే రెండో అభిశంసనకు అనుకూలంగా 229 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 198 ఓట్లు పడ్డాయి. కాగా, ఈ అభిశంసనను అధ్యక్ష భవనం వైట్ హౌస్ నిందించింది. అమెరికా చరిత్రలోనే అత్యంత అవమానకరమయిన, సిగ్గుమాలిన రాజకీయ సంఘటనగా అభివర్ణించింది. డెమొక్రటిక్ పార్టీలోని భారత సంతతికి చెందిన నలుగురు సభ్యులు ట్రంప్ అభిశంసనకు అనుకూలంగా ఓటు వేశారు. ఇప్పుడు ఈ అభశంసన సెనేట్‌కు వెళ్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో సెనేట్‌లో విచారణ జరుగుతుంది. 243 సంవత్సరాల అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు ఏ అధ్యక్షుడినీ అభిశంసన ద్వారా పదవిలోనుంచి తొలగించలేదు. వంద మంది సభ్యులున్న సెనేట్‌లో అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. ఇప్పుడు ట్రంప్‌ను పదవి నుంచి దింపాలంటే కనీసం 20 మంది రిపబ్లికన్లు డెమొక్రాట్లతో చేతులు కలిపి ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయవలసి ఉంటుంది.