అంతర్జాతీయం

అంతరిక్ష యుద్ధాలకు అమెరికా కొత్త బలగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: రష్యా, చైనాల నుంచి ఎదురవుతున్న 21వ శతాబ్దపు వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కోవడానికి అమెరికా కొత్తగా పూర్తి స్థాయి అంతరిక్ష బలగాన్ని (స్పేస్ ఫోర్స్) ఏర్పాటు చేసుకుంది. ఈ కొత్త బలగం అమెరికా రక్షణ విభాగంలో అంతర్భాగంగా ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిఘటనకు తొలి ప్రాధాన్యం ఇస్తుండటంతో అధ్యక్ష భవనం వైట్‌హౌస్ భవిష్యత్తులో జరిగే అవకాశం ఉన్న నక్షత్ర యుద్ధాల (స్టార్ వార్స్)లో వెనుకబడి పోకూడదన్న తన నిబద్ధతను ఇలా వెల్లడించింది. హంతక ఉపగ్రహాలు (కిల్లర్ శాటిలైట్స్), ఉపగ్రహాలను ధ్వంసం చేసే ఆయుధాలు (శాటిలైట్-కిల్లర్ వెపన్స్) వంటి నక్షత్ర యుద్ధాలు భవిష్యత్తులో చోటు చేసుకుంటాయని, ఆ యుద్ధాలలోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని అమెరికా భావిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ 2020 నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్‌పై సంతకం చేయడం ద్వారా అంతరిక్ష బలగం ఏర్పాటును వాస్తవ రూపంలోకి తీసుకొచ్చారు. ఈ చట్టం కింద అంతరిక్ష బలగానికి తొలి బడ్జెట్‌ను కేటాయిస్తారు. అమెరికా మిలిటరీలోని ఇతర అయిదు శాఖలతో సమానంగా కొత్త అంతరిక్ష బలగం నిలుస్తుంది. ‘్భవిష్యత్తులో అంతరిక్షం ప్రపంచ కొత్త యుద్ధరంగంగా మారబోతోంది. అందువల్ల అంతరిక్షంలో అనేక అంశాలు జరుగబోతున్నాయి’ అని ట్రంప్ కొత్త చట్టంపై సంతకం చేసిన సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. కొత్తగా ఏర్పడిన ఈ అంతరిక్ష బలగం.. అమెరికాలోని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మెరైన్స్, కోస్ట్‌గార్డ్‌లతో పాటు ఆరో బలగంగా పనిచేస్తుంది. ‘మన అంతరిక్ష ఆధారిత సామర్థ్యాలు నాటకీయంగా పెరిగాయి. ఈ రోజు మన బాహ్య అంతరిక్షం తనంత తానుగా యుద్ధప్రాంతంగా మారిపోయింది’ అని అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పర్ శుక్రవారం పేర్కొన్నారు.