అంతర్జాతీయం

క్రిస్మస్ వేళ.. తుపాను విలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, డిసెంబర్ 25: క్రిస్మస్ హాలిడే సీజన్ సెంట్రల్ ఫిలిప్పీన్స్ ప్రజలకు తీవ్ర విషాదానే్న మిగిల్చిందని చెప్పాలి. యావత్ ప్రపంచం క్రిస్మస్ సంబురాల్లో మునిగితేలుతున్న వేళ.. సెంట్రల్ ఫిలిప్పీన్స్ తుపాను విలయానికి చిగురుటాకులా వణికిపోయింది. మంగళవారం రాత్రి వారికి కాళరాత్రిగానే మారిందనే చెప్పాలి. తుపాను తీవ్రతకు ఫిలిప్పీన్స్‌లోని తీర ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకొన్నాయి. వర్ష బీభత్సంతో పాటు ఈదురుగాలుల తీవ్రతకు జనం అల్లల్లాడిపోయారు. సుమారు 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో వేలాది చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించడంతో ప్రాణ నష్టాన్ని కొంతమేర తగ్గించగలిగారు. ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. 2013లో వచ్చిన తుపానులో దాదాపు ఏడువేల 300మందికి పైగా మృత్యువాత పడడం లేదా ఆచూకీ కనిపించకపోవడం సంభవించింది. అదే స్థాయిలో ప్రస్తుత తుపాను కూడా ఉందని పలువురు ప్రత్యక్ష సాక్షులు ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు. క్రిస్మస్ వేడుకలకు దేశ ప్రజలు సన్నద్ధం అవుతున్న వేళ.. ఒక్కసారిగా ఏర్పడిన ఈ తుపాను కారణంగా లక్షలాది ప్రజలు కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితమయ్యారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతం. మెడ లోతు నీళ్లలో జనం మునిగి ఉండడం కనిపించింది. పునరావాస కేంద్రాలకు వెళ్లని అనేకమంది మెడ లోతు నీటిలో ప్రాణాలు కాపాడుకోవడానికి పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. సెంట్రల్ ఫిలిప్పీన్ రీజియన్‌లోని అనేక నగరాలు తుపాను విలయానికి వణికిపోయారనే చెప్పాలి. వేలాది మందిని స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు ఇతర భవనాలకు తరలించి వారికి ఏర్పాట్లు చేశారు. వర్షం తగ్గే వరకు తన భర్త పనిచేసే వాతావరం కార్యాలయంలో బిడ్డతో సహా తలదాచుకొన్నామని.. తీవ్రత తగ్గిన తరువాత ఇంటికి వచ్చి చూడగా ఈదురుగాలుల తీవ్రతకు తమ ఇంటి కిటికీల అద్దాలన్నీ పగిలిపోయి కనిపించాయని ఓ మహిళ పేర్కొంది. మంగళవారం రాత్రి అంతా కంటిమీద కునుకు లేకుండానే గడిపామనీ.. తీవ్రత తగ్గిన తరువాత ఇంటికి రాగా తమ రెండు కుక్కలు భద్రంగానే ఉన్నాయని మరో మహిళ స్పష్టం చేసింది. అయితే, ఇల్లంతా వరద నీటితో బురదమయం అయ్యిందని.. ఓ చెట్టు తమ ఇంటిపై కూలిపోయిందని టక్లొబాన్ నగరానికి చెందిన పౌరుడు ఒకరు తెలియజేశారు. అత్యంత వేగంగా వీచిన గాలుల తీవ్రతకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాల్సి ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
వరద తీవ్రతకు రోడ్లు కొట్టుకుపోయాయనీ.. కొబ్బరి, అరటి చెట్లు తీవ్ర ఈదురు గాలులకు నేలమట్టం అయ్యాయని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఫెర్రీ సర్వీసులు నిలిపివేయడంతో వేలాది మంది తమ సొంత ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితుల్లో నానా అవస్థలు పడినట్లు కోస్టు గార్డు వర్గాలు తెలిపాయి. దాదాపు 25వేల మంది రాత్రంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారని సెంట్రల్ ఫిలిప్పీన్స్ అధికార వర్గాలు తెలిపాయి. చాలా వరకు విమాన సర్వీసులను బుధవారం పునరుద్ధరించక పోవడంతో ఇతర దేశాలకు వెళ్లే ప్రజలు ఎయిర్‌పోర్టుల్లోనే నిలిచిపోయారు. ‘పునరావాస కేంద్రాల్లో ఉన్న వారంతా క్షేమంగా ఉన్నారు.. కనీసం క్రిస్మస్ విందు భోజనం కొంతమందికి అక్కడ దొరికింది.. చేపలు, నూడుల్స్ వంటివి వారికి అందుబాటులో ఉండడంతో చాలామందికి ఆకలి తీరింది’ అని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. పునరావాస కేంద్రాల్లో క్రిస్మస్ సందర్భంగా టేబుల్‌పై భోజనం చేయగలిగినప్పటికీ వారికి తమ ఇళ్ల వద్ద పండుగ చేసుకోలేకపోయామన్న బాధ మిగిలిపోయిందని కొంతమంది పేర్కొన్నారు. పునరావాస కేంద్రాల్లో క్రిస్మస్‌ను సంబురాలను చాలా మంది జరుపుకోలేకపోయారని సహాయ పునారాస కేంద్రానికి చెందిన అధికారి సెసైల్ బెడొనియా ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు ఫోన్ ద్వారా తెలిపారు. వాయువ్య ప్రాంతంలోని కొరొన్ దీవి వద్ద బీచ్‌లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. తుపాను తీవ్రత తగ్గిన తరువాత అంటే గురువారం బయల్దేరుతామని సంబంధిత టూరిస్టు అతిథి గృహాల్లో ఉన్న పర్యాటకులు పేర్కొన్నారు. అనేక పర్యాటక అతిథి గృహాలను మూసివేశారు. అనేక విమాన సర్వీసులను రద్దు చేయడంతో అతిథిగృహాలకు వచ్చే పర్యాటకులు అతిథి గృహాల్లో తలదాచుకోవడానికి వస్తే అవి కాస్తా మూసివేయడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ‘తుపాను తీవ్రతను చూసి మేం భయపడలేదు.. కానీ దాని తీవ్రత అత్యంత భయానకంగానే ఉంది’ అని ఓ హోటల్ రిసెప్షనిస్టు పేర్కొంది.