అంతర్జాతీయం

పెను తుపానుకు 20 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, డిసెంబర్ 26: మధ్య ఫిలిప్పీన్స్‌లో క్రిస్మస్ రోజు తుపాను పెను విషాదాన్ని మిగిల్చింది. తుపానుకు ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు. కేథలిక్ క్రైస్తవులు అధికంగా ఉండే ల్లొయిలో రాష్ట్రం అతలాకుతులమైంది. క్రిస్మస్ పర్వదినం రోజు ప్రజలందరూ ఆనందడోలికల్లో ఉండగా పెను తుపాను బీభత్సం సృష్టించింది. స్వగ్రామాలకు బయలుదేరిన ప్రజలు రేవులు, విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. ‘్ఫన్‌ఫోన్’ తుపాను తీవ్రతకు కొండ చరియలు విరిగిపడ్డాయి. లోతట్టు గ్రామాల్లోకి వరద ప్రవేశించింది. అనేక గృహాలు ధ్వంసమయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. సెంట్రల్ ఫిలిప్పీన్స్ అంతటా అంధకారం అలముకుంది. క్రిస్మస్ రోజు తుపాను కరాళ నృత్యం చేసిందని బాటాడ్ పట్టణంలోని ప్రకృతి వైపరీత్యాల అధికారి ఒకరు వెల్లడించారు. పట్టణం అంతా ప్రేతకళ ఆవహించినట్టు తయారైందని క్యాండే ఫెర్రార్ అనే ప్రాంతీయ అధికారి తెలిపారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. క్రిస్మస్ రోజు బుధవారం అంతా వాతావరణం బీభత్సంగా మారిపోయింది. వివిధ సంఘటనల్లో 20 మంది చనిపోయారు.
'చిత్రం...ఫిలిప్పీన్స్‌లోని ఓర్మాక్ నగర తీరప్రాంతంలో ‘్ఫన్‌ఫోన్’ పెనుతుపాను సృష్టించిన విధ్వంసం ఇది