అంతర్జాతీయం

పురుళ్లలో భారత్ నంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి: జనాభా విషయంలో భారత్ కొన్నాళ్లకు చైనాను మించిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదనడానికి నిదర్శనం నూతన సంవత్సరం రోజున (జనవరి 1న) దేశంలో జరిగిన పురుళ్లేనని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా జనవరి ఒకటో తేదీన జరిగిన పురుళ్లలో భారత్ అన్ని దేశాలకూ దీటుగా నిలుస్తూ మొదటి స్థానంలోకి చేరిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా జనవరి ఒకటో తేదీన నాలుగు లక్షల పురుళ్లు జరిగితే కేవలం భారత దేశంలో 67వేల 385 పురుళ్లతో మొదటి స్థానంలో నిలిచింది. యునిసెఫ్ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది దేశాల్లో సేకరించిన పురుళ్ల లెక్కలను ఓసారి పరిశీలిస్తే.. ఎనిమిది దేశాల్లో దాదాపు మూడు లక్షల 92వేల 78 పురుళ్లు జరిగాయి. ఇందులో ఒక్క భారత దేశంలోనే 67వేల 385 మంది పురుడు పోసుకొని రికార్డుల్లో మొదటిస్థానంలో నిలిచారు.
విచిత్రం ఏమిటంటే జనాభాలో మొదటి స్థానంలో ఉండే చైనా 46వేల 299 పురుళ్లతో రెండో స్థానంలో నిలిచింది. జనవరి ఒకటో తేదీన మొట్టమొదటగా బేబీకి జన్మనిచ్చిన ప్రదేశంగా ఫసిఫిక్‌లోని ఫిజీలో జరగగా ఆఖరున జన్మనిచ్చిన ప్రదేశంగా అమెరికా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా యునిసెఫ్ ఎనిమిది దేశాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం భారత దేశంలో 67వేల 385 పురుళ్లు జరగగా.. చైనా 46వేల 299మందితో రెండో స్థానంలో నిలిచింది.