అంతర్జాతీయం

నల్లగొండ యువకుడికి అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరిడేపల్లి, ఏప్రిల్ 14: నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన పోటు భగత్‌కుమార్ దేశంలోనే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మక యూరోపియన్ జనరల్ ఆఫ్ మెడిసిన్ ఎడిటోరియల్ బోర్డులో మెంటర్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం బహ్రెయన్‌లోని అరేబియన్ గల్ఫ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ఫ్రొపెసర్‌గా పనిచేస్తున్న భగత్‌కుమార్ ఎముకల తరుగుదల వ్యాధిపై పరిశోధనలు చేసి ఈ ఘనత సాధించారు.సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన భగత్‌కుమార్ ఆరేళ్ల వయస్సులో ఉన్నప్పుడే అతని తండ్రి పోటు చలపతిరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తల్లి విజయశ్రీ, సోదరి మానసతో కలిసి చిన్నతనంలోనే కష్టాల ప్రస్థానం ప్రారంభమైంది. అయినప్పటికీ తాతయ్య, అమ్మమ్మ, బాబాయిల సహకారంతో తల్లి ప్రోత్సాహంతో ఈస్థాయికి తాను ఎదిగినట్లు భగత్‌కుమార్ తెలిపారు. ప్రాథమిక విద్యను హుజూర్‌నగర్ చైతన్య పాఠశాలలో పూర్తిచేసి, ఇంటర్, డిగ్రీ ఖమ్మంలో పూర్తిచేశారు.
2000 సంవత్సరంలో కాకతీయ యూనివర్సిటీ నుంచి మెడికల్ మైక్రోబయాలజీలో డిగ్రీ పూర్తిచేసిన భగత్‌కుమార్ 2004లో మణిపాల్ యూనివర్సిటీలో మెడికల్ ఎనాటమీలో ఎమ్మెస్సీ పూర్తిచేసి మెరిట్ సాధించడంతో అదే యూనివర్సిటీలో లెక్చరర్‌గా అవకాశం లభించింది. ఉద్యోగం చేసుకుంటూ సాయంత్రం నుంచి రాత్రి వరకు పరిశోధనలు చేస్త్తూ 2010 సంవత్సరంలో పిహెచ్‌డి పట్టా పొందారు.2011 నుంచి 2012 వరకు అమెరికాలోని సెయింట్‌లూసియా వర్సిటీలో సంవత్సరం పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2012 నుంచి 2014 వరకు మలేసియాలోని యుసిఎస్‌ఐ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.2000 సంవత్సరం నుంచి 2016 వరకు చేసిన పరిశోధనలను మలేసియా, థాయ్‌లాండ్, చెక్ రిపబ్లిక్, ఇటలీ, ఆస్ట్రేలియా, టర్కీ, తైవాన్ దేశాల్లో ప్రజెంట్ చేశారు.

చిత్రం మలేసియాలో మాజీ డెరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ తాజుద్దీన్‌తో వైద్యవిద్యపై జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న భగత్‌కుమార్.