అంతర్జాతీయం

తొక్కిసలాటలో 35 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెహ్రన్, జనవరి 7: అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ సైనిక కమాండర్ ఖాసీం సూలేమానీ అంతిమయాత్ర సందర్భంగా మంగళవారం కెర్మన్ పట్టణంలో జరిగిన తొక్కిసలాటలో 35 మంది మరణించారు. 190 మంది గాయపడ్డారు. సులేమానీ అంత్యక్రియలకు లక్షల సంఖ్యలో ప్రజలు హాజరుకావడంతో ఈ తొక్కిసలాట జరిగింది.
అమెరికా జరిపిన లక్ష్యిత దాడిలో మృతి చెందిన ఇరాన్ ఉన్నత స్థాయి కమాండర్ జనరల్ ఖాసీం సులేమానీ అంత్యక్రియలకు అశేష ప్రజానీకం హాజరయ్యారు. సులేమానీ స్వంత పట్టణం కేర్మన్‌లో మంగళవారం జరిగిన అంత్యక్రియలకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అశేష ప్రజానీకం తమ అభిమాన కమాండర్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. టెహ్రాన్, ఖావోమ్, మష్‌హాద్, అహ్‌వాజ్ నగరాలలో రెవల్యూషనరి గార్డ్స్ విదేశీ విభాగానికి అధిపతి జనరల్ ఖాసీం సులేమానీకి శ్రద్ధాంజలి ఘటించడానికి అశేష ప్రజానీకం తరలివచ్చినట్టుగానే మంగళవారం అతని స్వంత పట్టణం కేర్మన్‌లోనూ అతడికి అంతిమ వీడ్కోలు పలకడానికి వేలాది మంది తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వీరంతా ఆజాదీ స్క్వేర్‌కు సమీపంలో కలిశారు. ఇరాన్ జాతీయ పతాకాలు కప్పిన రెండు శవపేటికలను అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచారు.
వీటిలో ఒకటి జనరల్ సులేమానీది కాగా, రెండోదానిలో అతడి సన్నిహిత అనుచరుడు, బ్రిగేడియర్ జనరల్ హుస్సేన్ పౌర్‌జఫారి భౌతికకాయం ఉంది. ‘పవిత్రమయిన రక్షణ విభాగంలో గొప్ప కమాండర్‌కు శ్రద్ధాంజలి ఘటించడానికి మేము ఈరోజు ఇక్కడికి చేరుకున్నాం’ అని కేర్మన్‌లో సులేమానీ అంత్యక్రియలలో పాల్గొనేందుకు దక్షిణాది నగరం షిరాజ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి అన్నారు. ‘హజ్ ఖాసీంను కేర్మన్ లేదా ఇరాన్ మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచం ప్రేమిస్తోంది’ అని హెమ్మత్ డెహ్‌ఘాన్ అనే వ్యక్తి ఒక వార్తాసంస్థ ప్రతినిధితో అన్నారు. ‘మొత్తం ప్రపంచం ముస్లింలు, షియాలు, ఇరాక్, సిరియా, అఫ్గానిస్తాన్, ప్రత్యేకించి ఇరాన్ భద్రత కోసం ఆయన పనిచేశారు. వీరంతా ఆయనకు రుణపడి ఉన్నారు’ అని ఆ 56 ఏళ్ల యుద్ధ వీరుడు అన్నారు.
'చిత్రం...కెర్మన్‌లో మంగళవారం జరిగిన ఇరాన్ సైనిక కమాండర్ ఖాసీం సూలేమానీ అంతిమయాత్ర