అంతర్జాతీయం

‘వాల్‌స్ట్రీట్’ రిపోర్టర్లపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఫిబ్రవరి 19: ఓ పక్క కరోనా వైరస్‌తో సతమతమవుతుంటే మీడియాలు వస్తున్న కథనాలు అంతర్జాతీయ సమాజంలో చులకన చేసేలా ఉంటున్నాయని చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా విదేశీ మీడియా వార్తలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. దీనిలో భాగంగా అమెరికా పత్రిక ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’కు చెందిన ముగ్గురు రిపోర్టర్లపై వేటు వేసింది. జర్నలిస్టులుగా వారికున్న గుర్తింపును చైనా ప్రభుత్వం బుధవారం రద్దుచేసింది. వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో వచ్చిన ఓ వార్తా కథనం చైనా ఆగ్రహానికి కారణమైంది. ‘రియల్ సిక్ మ్యాన్ ఆఫ్ ఆసియా’ శీర్షికన అమెరికా పత్రిక ఒపీనియన్ కాలం లో కథనం వచ్చింది. వాల్‌స్ట్రీట్ జర్నల్ జాత్యాహంకారం, అప్రతిష్టపాలుజేసేదిగా వ్యవహరించిందంటూ బీజింగ్ మండిపడింది. చైనా విదేశాంగ ప్రతినిధి గెంగ్ షూంగ్ బుధవారం నాడొక ప్రకటన చేస్తూ అమెరికా పత్రికలో వార్తాకథనం తమ ప్రజలను, దేశ ప్రతిష్టను దెబ్బతీసేదిగా ఉందని ఆరోపించారు. వైరస్‌పై పనిగట్టుకుని వార్తలు వండ డం, ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుందన్నట్టు మీడియా తీరు ఉందని ఆయన విమర్శించారు. అంతర్జాతీయ సమాజంలో తమను కించపరిచే విధంగా వాల్‌స్ట్రీట్ జర్నల్ చిత్రీకరించిందని ప్రతినిధి అన్నారు. మీడియా ప్రధానంగా విదేశీ మీడియా తీరు అభ్యంతరకరంగా ఉంటోందని ఆయన చెప్పారు. ఇలా ఉండగా వాల్‌స్ట్రీట్ జర్నల్, విదేశీ మీడియాపై ప్రభుత్వ ఆంక్షలు విధించింది. చైనాలో అంత సులభంగా ఆ పత్రికలు వెబ్‌సైట్ లభ్యం కాదు. ప్రభుత్వం సెన్సార్ చేసాకే ఆన్‌లైన్‌లో వ్యాసాలు, వార్తలు కనిపిస్తాయి. మరోపక్క విదేశీ మీడియాపై చైనా ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. విలేఖరుల గుర్తింపును రెన్యువల్ చేయడం దగ్గర నుంచి అన్నింటా కఠిన నిబంధనలు ఉంటున్నాయి. అయితే ముగ్గురు అం తర్జాతీయ పత్రిక రిపోర్టర్లపై వేటు వేయడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. జర్నలిస్టులుగా వారి గుర్తింపును రద్దుచేయడంతోపాటు దేశం నుంచి బహిష్కరిస్తున్నట్టు చైనా ప్రకటించింది. తాజాగా చైనా తీసుకున్న నిర్ణయం విదేశీ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. చైనా సార్వభౌమాధికారం, దేశ ప్రయోజనాలను నష్టం చేసేలా ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని అధ్యక్షుడు జీ జింపింగ్ పదేపదే హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాతో పలు వాణిజ్య ఒప్పందాలను చైనా రద్దు చేసుకుంది.