అంతర్జాతీయం

సవాళ్లకు దీటుగా ఐరాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఫిబ్రవరి 25: 21వ శతాబ్ద సవాళ్లను ఎదుర్కొని అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని అవసరానుగుణంగా సంస్కరించాల్సిన అగత్యం ఎంతో ఉందని భారత్ ఉద్ఘాటించింది. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థల విశ్వసనీయత పెరగాలంటే ఈ సంస్కరణలు అనివార్యమని భారత్ తేల్చిచెప్పింది. ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవ సంప్రదింపుల సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి కే నాగరాజ్ నాయుడు మాట్లాడుతూ ‘వర్తమాన ప్రపంచం ఎన్నో సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో బహుళ జాతీయవాదానికి ప్రతిఒక్కరూ నిబద్ధతతో కృషి చేయాలి’ అని అన్నారు. ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవం ఈ ఏడాదిలోనే జరుగుతున్న దృష్ట్యా వర్తమాన అవసరాలకు అనుగుణంగా దీనిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేసింది. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిపై నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవడానికి ఇంతకుమించిన అవకాశం మరొకటి లేదని తెలిపింది. బ్రెజిల్, జర్మనీ, జపాన్‌లతో కలిసి భద్రతా మండలి సంస్కరణల కోసం భారత్ గత కొంతకాలంగా పట్టుబడుతూ వస్తున్న విషయం తెలిసిందే. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం జీ-4 కూటమి దేశాలైన ఈ నాలుగు పరస్పర అభ్యర్థిత్వాన్ని బలపరచుకుంటున్నాయి. అంతర్జాతీయ సంబంధాల్లో ఐక్యరాజ్య సమితి వంటి ప్రపంచ సంస్థల పాత్ర అత్యంత కీలకమని నాగరాజ్ నాయుడు అన్నారు. అయితే, ఈ సంస్థలు అర్థవంతంగా, విశ్వసనీయంగా మనుగడ సాగించాలంటే కాలానుగుణంగా వీటిలో మార్పులు తీసుకురావడం అన్నది అనివార్యమని ఆయన తెలిపారు. ఈ మార్పులు తేలేని పక్షంలో 1940 నాటి భౌగోళిక, రాజకీయ పరిస్థితులకు ఇప్పటికీ అద్దం పడుతున్న వ్యవస్థలుగానే ఇవి నామమాత్రంగా మిగిలిపోతాయని ఆయన అన్నారు.