అంతర్జాతీయం

విహారానికి విరామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మియామి, మార్చి 12: ప్రినె్సస్ సహా మొత్తం 18 విహార నౌకలకు రెండు నెలల విరామం లభించింది. ఇటీవల జపాన్ తీర ప్రాంతంలో ఈ విహార నౌకను సుమారు 15 రోజుల పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రయాణికులెవరినీ కిందకు దిగేందుకు జపాన్ అధికారులు అనుమతించలేదు. అంతేకాక ఈ నౌకను తీరానికి సుదూరంలో ఉంచి, దానిని ముందుకు వెళ్లకుండా నిలువరించారు. కరోనా వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుందన్న ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఇలా ఉంటే.. ప్రినె్సస్, డైమండ్ వంటి విహార నౌకలను నడుపుతున్న కార్నివాల్ కార్పొరేషన్ కరోనా వైరస్‌పై దృష్టిపెట్టింది. దీని ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. అందుకే తాము నడుపుతున్న 18 నౌకలను మే రెండో వారం వరకు నిలిపివేస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ప్రయాణంలో ఉన్న విహార నౌక మరికొద్ది రోజుల్లోనే గమ్యాన్ని చేరబోతోందని తెలిపింది. అది ఒడ్డుకు చేరిన వెంటనే నిలిపివేస్తామని.. తదుపరి షెడ్యూల్‌ను సుమారు రెండు నెలల పాటు వాయిదా వేస్తున్నామని వివరించింది.