అంతర్జాతీయం

ఉత్తర కరోలినాలో మళ్లీ ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షార్లొటే, సెప్టెంబర్ 24: ఉత్తర కరోలినా పట్టణం షార్లోట్‌లో పోలీసుల కాల్పుల్లో మరణించిన నల్లజాతీయుడు ఖైత్ లామోంట్ స్కాట్ కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు కాల్పులకు సంబంధించి సెల్‌ఫోన్ కెమెరా వీడియోను అతడి కుటుంబ సభ్యులు విడుదల చేయడంతో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తన భర్తది ముమ్మాటికీ ఎన్‌కౌంటరేనని, పోలీసులే దారుణంగా కాల్చిచంపారని మృతుడి భార్య రాకియా ఆరోపించారు. ఎంఎస్‌ఎన్‌బిసి చానల్‌లో ప్రచారం చేసిన వీడియోలో పోలీసుల దాష్టీకరం కళ్లకు కట్టినట్టు ఉంది. స్కాట్‌వద్ద ఎలాంటి ఆయధం లేకపోయినా పోలీసు అధికారి తుపాకీ కింద పడేయాలంటూ పదేపదే హెచ్చరించాడు. అయితే తన భర్త వద్ద ఎలాంటి ఆయధం లేకపోయినా పోలీసులు వినకుండా కాల్చిచంపేశారని రాకియా వాపోయింది. బాధితుల ప్రశ్నలకు షార్లెట్ పోలీసు నుంచి సరైన సమాధానం లేదనరి స్కాట్ కుటుంబ లాయర్ చార్లెస్ జి మొనె్నట్ చెప్పారు. ఇప్పటికిప్పుడు దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వబోమని పోలీసు చీఫ్ కేర్ పుట్నే అన్నారు. ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో నల్లజాతీయులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో తాజా ఘటన మరింత ఉద్రిక్తతలను రేపే ప్రమాదం ఉంది. స్కాట్ మృతదేహం వీడియో విడుదలకు పోలీసులు సిద్ధంగా లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. స్కాట్ మృతి తరువాత వందలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. మరోపక్క డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ ఆదివారం ఇక్కడ పర్యటించనుంది. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం ఆమెకు ఇబ్బందేనని చెప్పవచ్చు.

చిత్రం.. ఉత్తర కరోలినాలో ఆందోళనకు దిగిన నల్లజాతీయులు