అంతర్జాతీయం

అమెరికా షాపింగ్ మాల్‌లో కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజెలిస్, సెప్టెంబర్ 24: వాషింగ్టన్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. మహిళలకు సంఘటనా స్థలంలోనే చనిపోగా, చికిత్స పొందుతూ మరొక వ్యక్తి మృతి చెందాడు. కాస్కాడే మాల్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కాల్పుల ఘటన జరిగిన వెంటనే పోలీసులు హుటాహుటిన మాల్‌కు చేరుకుని దుండగుడి కోసం గాలింపుచేపట్టారు. నార్త్ సీట్లేకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న బుర్లింగ్టన్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసు అధికారి మార్క్ ఫ్రాన్సిస్ వెల్లడించారు. షాపింగ్ మాల్‌లోని మేకప్ రూంలో జరిగిన కాల్పుల్లో నలుగురు మహిళలు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని హార్బోరివ్యూ మెడికల్ సెంటర్‌కు హెలీకాప్టర్‌లో తరలించినట్టు ఫ్రాన్సిస్ చెప్పారు. తరువాత అతడు చనిపోయాడు. కాల్పులకు పాల్పడిన అనుమానితుడి ఫొటోను విడుదల చేశామన్నారు. షాపింగ్ మాల్‌లోకి నడుచుకుంటూ వచ్చిన ముష్కరుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అన్నారు. అయితే అతడు ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడో తెలియరాలేదని పేర్కొన్నారు. మృతులంతా 20ఏళ్ల పైబడిన వారేనని ఆసుపత్రి అధికార ప్రతినిధి సుసాన్ గ్రేగ్ వెల్లడించారు.కాల్పులపై అనేక అనుమానాలున్నాయని, స్థానిక పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కారణాలు అనే్వషిస్తున్నారని వాషింగ్టన్ గవర్నర్ జే ఇన్‌స్లీ స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన గవర్నర్ పరిసర ప్రజలు ఎలాంటి ఆందోళన పడొద్దనని భరోసా ఇచ్చారు. దర్యాప్తులో స్థానిక పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని ఎఫ్‌బిఐ ప్రకటించింది. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదని పోలీసు బ్యూరో తన ట్విట్టర్‌లో పేర్కొంది.