అంతర్జాతీయం

భారతీయ సినిమాలను నిషేధించండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, సెప్టెంబర్ 24: కాశ్మీర్ సమస్య పరిష్కారమయ్యే దాకా పాకిస్తాన్‌లో భారతీయ సినిమాలపై నిషేధం విధించాలని కోరుతూ ఓ పిటిషన్ లాహోర్ హైకోర్టులో దాఖలయింది. అజర్ సాదిక్ అనే అడ్వకేట్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. భారత సైన్యం కాశ్మీర్‌లో అకృత్యాలకు పాల్పడుతోందని, స్థానిక థియేటర్లలో భారతీయ సినిమాలను ప్రదర్శించడానికి పాక్ ప్రభుత్వం అనుమతిస్తోందని, ఈ చర్య కాశ్మీరీల మనోభావాలనే కాకుండా పాక్ ప్రజల మనోభావాలను సైతం దెబ్బతీయడమేనని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాశ్మీర్‌పై పాక్ విధానాన్ని భారతీయ సినిమాలు వ్యతిరేకిస్తున్నాయని, కాశ్మీరీలు జరుపుతున్న స్వాతంత్య్ర పోరాటానికి పెద్ద అడ్డంకిగా ఉంటున్నాయని ఆ పిటిషన్ ఆరోపించింది. కాశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలపడానికి దేశవ్యాప్తంగా భారతీయ సినిమాల ప్రదర్శనను తక్షణం నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని ఆ పిటిషన్ కోరింది. కాగా, వచ్చే వారం ఈ పిటిషన్ విచారణకు రానుంది.