అంతర్జాతీయం

వైద్య శాస్త్రంలో జపాన్ శాస్తవ్రేత్తకు నోబెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోం, అక్టోబర్ 3: జపాన్‌కు చెందిన యొషినొరి ఒహ్‌సుమిని సోమవారం వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. మానవ శరీరంలో జీవకణాలు తమను తాము క్షీణింపచేసుకునే ప్రక్రియ (ఆటోఫాజి)పై చేసిన అధ్యయనానికి గాను యొషినోరికి నోబెల్ బహుమతి దక్కింది. ఆటోఫాజి అంటే జీవకణాలు పనిచేయడానికి సంబంధించిన ప్రాథమిక ప్రక్రియ. ఈ ప్రక్రియ ప్రభావం మానవ ఆరోగ్యంపై, వ్యాధులపై ఉంటుంది. క్రమంగా జీవకణాలు క్షీణించడం, అవి మళ్లీ పునరుపయోగంలోకి రావడానికి ఈ ప్రక్రియ తప్పనిసరి. ఈ ప్రక్రియ విఫలమైతే వృద్ధాప్యం సంతరించడానికి, కణజాలం దెబ్బతినడానికి దారితీస్తుందని భావిస్తున్నారు. కణాలు తమలోని అంశాలను క్షీణింప చేసుకోగలవని, తిరిగి లైసోసోమ్ అని పిలవబడే రీసైక్లింగ్ కంపార్ట్‌మెంట్‌లోకి వాటిని తీసుకొని పోగలవని శాస్తవ్రేత్తలు 1960లలో కనుగొన్నారు. ఈ దృగ్విషయాన్ని అధ్యయనం చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఈ ప్రక్రియ గురించి అప్పటి వరకు చాలా కొద్దిగా మాత్రమే తెలుసు. అయితే 1990లలో యొషినొరి ‘ఈస్టు’ను ఉపయోగించి తాను చేసిన వరుస ప్రతిభావంతమైన ప్రయోగాలలో ఆటోఫాజికి జన్యుకణాలు తప్పనిసరి అని కనుగొన్నారు. తరువాత ఈస్టులో జరిగిన క్రియా విధానాన్ని (చర్య) వివరించిన యొషినొరి, అలాంటి క్రియావిధానమే మానవ కణాలలో జరుగుతున్నదని నిరూపించారు. ఒహ్‌సుమి కనుగొన్న ఈ విషయం కణాలు తమ అంశాలను ఎలా రీసైకిల్ చేసుకుంటాయనే అంశాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడిందని నోబెల్ మెడిసిన్ ప్రైజ్ జ్యూరీ పేర్కొంది.
ఆటోఫాజిలో పరివర్తనల వల్ల జన్యు కణాలు వ్యాధులకు కారణం అవుతాయని, క్యాన్సర్, నాడి సంబంధమైన వ్యాధులు సహా అనేక పరిస్థితులలో ఆటోఫాజిక్ ప్రక్రియ జరుగుతుందని వివరించింది. 71 ఏళ్ల ఒహ్‌సుమి 1974లో యూనివర్శిటి ఆఫ్ టోక్యో నుంచి పిహెచ్‌డి పట్టా పొందారు. ఆయన ప్రస్తుతం టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజిలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ నోబెల్ ప్రైజ్ కింద ఆయనకు ఎనిమిది మిలియన్ స్వీడిష్ రోనోర్‌లు (సుమారు 936,000 డాలర్లు లేదా 834,000 యూరోలు) లభిస్తాయి.

చిత్రం.. నోబెల్ బహుమతి సాధించిన యొషినొరి ఒహ్‌సుమిని