అంతర్జాతీయం

24 గంటల్లో రెండు పెను భూకంపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుమమోటో (జపాన్) ఏప్రిల్ 16: దక్షిణ జపాన్‌లోని సుమమోటో ప్రాం తంలో 24 గంటల్లో సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాలకు కనీసం 35 మంది చనిపోగా, వందలాది మంది సజీవ సమాధి అయి ఉంటారని భయపడుతున్నారు. శక్తివంతమైన భూప్రకంపనల తాకిడికి వేల టన్నుల బురద మట్టి ఒక్కసారిగా పునాదుల కిందినుంచి కదిలి పోవడంతోవందలాది భవనాలు, రోడ్లు, రైలు మార్గాలు కొట్టుకు పోయాయి. ఒక యూనివర్శిటీ డార్మిటరీ, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లతో సహా వందలాది భవనాలు కుప్ప కూలిపోవడంతో వందల మంది జాడ తెలియకుండా పోయింది. అనేక ప్రాంతాల్లో శిథిలాల కింద చాలామంది చిక్కుకుపోయి ఉన్నట్లు తమకు సమాచారం అందిందని కేబినెట్ ముఖ్య కార్యదర్శి యోషిహిడె సుగా విలేఖరుల సమావేశంలో చెప్పారు. వారిని కాపాడడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్వయం రక్షక దళాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయని సుగా చెప్పారు. దాదాపు 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 300 మంది కూలిపోయే ప్రమాదం ఉందని భావించిన ఒక డ్యామ్ సమీప ప్రాంతానికి చెందిన వారు. శనివారం ఉదయం రిక్టర్ స్కేలుపై 7 పాయింట్ల తీవ్రతతో సంభవించిన భూకంపం తాకిడికి ఒక ఆస్పత్రి మొత్తం కకావికలై పోయింది. కారు చీకట్లోనే డాక్టర్లు, రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భవనం లోపలినుంచి బైటికి పరుగులు తీశారు. కొండచరియలు విరిగిపడ్డం, రోడ్లు తెగిపోయిన కారణంగా కుమమోటో పర్వత ప్రాంతాలపై ఉన్న గ్రామాలకు మిగతా ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. కేవలం ఒక ప్రాంతంలోనే దాదాపు వెయ్యి మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఒక ప్రధాన ట్రంక్ రోడ్డుపై వంతెన స్తంభాలు విరిగిపోవడంతో కింద ఉన్న క్యారేజివేపై వంతెన పడిన దృశ్యాలు కనిపించాయి. గురువారం రాత్రి పొద్దుపోయాక రిక్టర్ స్కేలుపై 6.2 పాయింట్ల తీవ్రతతో ఇదివరకే వచ్చిన భూకంపం తాకిడికి దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి సహాయక బృందాలు సిద్ధమవుతున్న తరుణంలో రెండో భూకంపం సంభవించింది. గోరుచుట్టుపై రోకటిపోటులాగా దగ్గర్లో ఉన్న ఓ అగ్నిపర్వతంనుంచి లావాఎగసిపడుతూ ఉండడం అధికారులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అయితే భూకంపాలకు, అగ్నిపర్వతంనుంచి లావా చిమ్ముతుండడానికి ఎలాంటి సంబంధం లేదని, లావా చిమ్మడం సైతం పరిమిత స్థాయిలోనే ఉంటుందని శాస్తజ్ఞ్రులు అంటున్నారు.

చిత్రం జపాన్‌లో భూకంపానికి కూలిపోయన భవనం