అంతర్జాతీయం

చట్టానికి కట్టుబడక తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 16: ఇటీవలి వీసా ఫీజు పెంపు విషయంలోతాము చట్టానికి కట్టుబడక తప్పదని అమెరికా ప్రభుత్వం భారత్‌కు స్పష్టం చేసింది. అమెరికా ప్రభుత్వం ఇటీవల హెచ్- 1బి, ఎల్-1 వీసాలకు చెందిన కొన్ని కేటగిరీల వీసా ఫీజులను భారీగా పెంచిన విషయం తెలిసిందే. భారతీయ ఐటి కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపించే ఈ ఫీజు పెంపు విషయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల జరిగిన భారత్- అమెరికా ద్వైపాక్షిక సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించి, ఇది భారతీయ ఐటి కంపెనీలపై వివక్ష చూపించడమేనంటూ అభ్యంతరం వ్య క్తం చేశారు కూడా. ‘ప్రధానంగా రెండు సమస్యలున్నాయి. వాటిలో ఒకటి ఇటీవల పెంచిన వీసా ఫీజుల అంశం కాగా, రెండవది ఐటి ప్రొ ఫెషన్లకు సంబంధించిన మొత్తం చార్జీల పాత అంశం. ఈ రెండు అంశాలపై అమెరికా స్పందన ఏమిటంటే చట్టం అలా పేర్కొంటోందనేది’ అని మీడియా రౌండ్ టేబుల్ సందర్భంగా భారతీయ విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం గా జైట్లీ చెప్పారు. అందువల్ల చట్టాన్ని మార్చనంతవరకు అది అలాగే కొనసాగుతుంది అని కూడా జైట్లీ చెప్పారు. ఈ వారం ప్రారంభంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి మైక్ ఫ్రోమన్‌తో జరిగిన సమావేశంలో మీరు ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తినప్పుడు ఏం సమాధానం వచ్చిందని అడిగినప్పుడు జైట్లీ ఈ విషయం చెప్పారు. వీసా పెంపు కేవలం భారతీయ ఐటి కంపెనీలపైనే ప్రభావం చూపిస్తోందని జైట్లీ ఈ సమావేశంలో గుర్తు చేస్తూ ఇది వివక్షేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
భారతీయ ఐటి కంపెనీల్లో పాపులర్ అయిన హెచ్-1బి, ఎల్-1 వీసాలపై అమెరికా కాంగ్రెస్ గత ఏడాది దాదాపు 4 వేల డాలర్ల మేరకు ప్రత్యేక ఫీజు విధించడం తెలిసిందే.