అంతర్జాతీయం

ఇండోనేసియా విమానం గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, డిసెంబర్ 3: ఇండోనేసియా పోలీసు విమానం గల్లంతైంది. 16 మందితో వెళ్తున్న విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ ఇండోనేసియాలో ఇది చోటుచేసుకుంది. ఎం28 స్కైట్రక్ చిన్న విమానం శనివారం మధ్యాహ్నం 1.50 గంటల నుంచి ఎయిల్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి)తో సంబంధాలు తెగిపోయాయి. గల్లంతైన విమానం కూలిపోయి ఉంటుందన్న భయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. కాగా మత్స్యకారులకు దస్తులు, సూట్‌కేసులు, విమానం సీట్లు కనిపించాయని పోలీసు ప్రతినిధి బాయ్ రఫ్లీ వెల్లడించారు. ఎం28 స్కైట్రక్ విమానం బంగ్తా బెలిటంగ్ ప్రొవిన్స్‌లోని పంగ్తల్ పినాంగ్ నుంచి బాటమ్ వెళ్తుండగా ఏటిసితో సంబంధాలు తెగిపోయాయని ఆయన అన్నారు. ఎనిమిది మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం 10.15 ప్రాంతంలో మిస్సయిందని తొలుత పోలీసులు ప్రకటించారు. ఐదుగురు విమానం సిబ్బంది ఉన్నారని తెలిపారు. తుది సమాచారం మేరకు గల్లంతైన విమానంలో 16మంది ఉన్నారని పేర్కొన్నారు. విమానం ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పౌర విమానయాన రంగానికి సంబంధించి ఇండోనేసియా వెనకబడే ఉన్నట్టు అనేక ఉదంతాలు తెలియజేస్తాయి. భద్రతాపరమైన లోపాల కారణంగానే ఇండోనేసియాలో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. గత వారమే ఇండోనేసియా సైనిక హెలీకాప్టర్ బోర్నియో ద్వీపంలో కూలిపోయి ముగ్గురు మృతి చెందారు. గత నెలలో పపావు ప్రాంతంలో కార్గో విమానం ఒకటి కూలిపోయి నలుగురు మృతి చెందారు.