అంతర్జాతీయం

మైన్మార్ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా సూకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైపిడా, మార్చి 31: అర్థ శతాబ్దం తరువాత మైన్మార్‌లో ప్ర జాస్వామ్యం పునరుజ్జీవానికి పా టుపడిన వీరనారి ఆంగ్‌సాన్ సూకీ ప్రభుత్వంలో ప్రత్యేక సలహాదారు పాత్ర పోషించనున్నారు. దీనికి సంబంధించి నేషనల్ లీగ్ డెమోక్రటిక్ పార్టీ (ఎన్‌ఎల్‌డి) గురువారం కొత్త ప్రతిపాదనను అందజేసింది. సైనిక పాలన నుంచి సూకీ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్న నేపథ్యంలో ఆగ్నేయాసియా దేశాల్లో ఆనందానికి అవధుల్లేవు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డి చారిత్రాత్మక విజయం సాధించినా సూకీ దేశాధ్యపదవి చేపట్టలేకపోయారు. దీంతో ఆమె సన్నిహితుడు, మాజీ డ్రైవర్ హితిన్ క్యా పేరును అధ్యక్ష పదవికి సూచించడంతో బుధవారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం ఆయన అధికార పగ్గాలు చేపట్టనున్నారు. కాగా మైన్మార్ ముద్దుబిడ్డ ఆంగ్‌సాన్ సూకీ సేవలను వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ‘ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు’ పదవిని సృష్టించినట్టు పార్టీ ఎంపీలు వెల్లడించారు. ఇక నుంచి ఆమె అధ్యక్షుడు, పార్లమెంటు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారని అన్నారు. దీనికి సంబంధించి పార్లమెంటు ఎగువసభకు ఓ ప్రతిపాదన అందజేశారు. జోమీ కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీకి చెందిన జిన్ కమ్ లియాన్‌తోపాటు పలువురు ఎంపీలు నివేదిక అందజేశారు. త్వరలోనే దీనిపై చర్చించి ఆమోదం తెలపుతారు.