అంతర్జాతీయం

రాణి గారి రాజసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి ఆమె మహారాణి. 63 ఏళ్ల రాచరికపు దర్పం ఆమెది. అయినా ఆమెకు ఇప్పటి వరకు ఎలాంటి పాస్‌పోర్ట్ లేదు. ఆమె ముఖమే ఆమెకు పాస్‌పోర్ట్. తిరుగులేని బ్రిటిష్ రాచరికపు దర్పంతో.. పాస్‌పోర్ట్ లేకుండానే ఆమె 117 దేశాలు పర్యటించి వచ్చింది. బ్రిటన్‌ను ఏలిన రాజులు, రాణుల్లో అత్యధిక కాలం పరిపాలన సాగించిన రాణిగా రికార్డు సృష్టించిన ఎలిజబెత్ గురువారం తన 90వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. అయినా ఆమెలో అలసట కనిపించటం లేదు. బ్రిటన్ ప్రజల్లో 70శాతం మంది కూడా శక్తియుక్తులున్నంత కాలం ఆమె తమ రాణిగా ఉండాలనే భావిస్తున్నారు. కొన్ని అధికారాలు తన వారసులకు బదలాయించినా, రిటైర్ అయ్యే ఆలోచన ఎంతమాత్రం కనిపించటం లేదు. గురువారం జరిగే పుట్టినరోజు వేడుకల్లో ఓ టెలివిజన్ రియాల్టీ షో స్టార్ తయారు చే సిన కేక్‌ను రాణీవారు కట్ చేయనున్నారు. ఈనేపథ్యంలో క్వీన్ ఎలిజబెత్ -2 గురించిన కొన్ని ఆసక్తికర అంశాలు..
- ఏప్రిల్ 21, 1926: లండన్‌లోని మేఫెయిర్ జిల్లాలోని 17బ్రుటన్ స్ట్రీట్‌లో ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ విండ్సర్ జననం. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బాంబు దాడికి ఈ భవంతి కూలిపోయింది.
-4: క్వీన్‌కు నాలుగేళ్ల వయసులో పెగ్గీ అన్న గుర్రం పిల్లను కింగ్ జార్జి 5 బహుమానంగా ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె హార్స్‌రైడింగ్ చేస్తోంది.
-33, 446, 430 నిమిషాలు: నిరుడు సెప్టెంబర్ 9 సాయంత్రం 5.30 గంటల వరకు ఎలిజబెత్ రాణి అత్యంత ఎక్కువ కాలం బ్రిటన్ సామ్రాజ్యాన్ని ఏలిన రాణిగా రికార్డు సృష్టించారు.
- 12: ఎలిజబెత్ రాణిగా ఉన్న ఈ కాలంలో మొత్తం 12మంది ప్రధానమంత్రులు వచ్చారు. ఈమె హయాంలో తొలి ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ కాగా.. ప్రస్తుత ప్రధాని డేవిడ్ కేమరాన్.
-117: పాస్‌పోర్ట్ లేకుండా 117 దేశాలు తిరిగారు.
-50000: రాణిగారి తోట పార్టీలకు హాజరయ్యే ఆహ్వానితుల సం ఖ్య ఇది. ఇప్పటివరకు తోట పార్టీలకు హాజరైన వారి సంఖ్య 14.50 లక్షల మంది.
-626: క్వీన్ ఎలిజబెత్ పాట్రన్‌గా ఉన్న చారిటీలు, రెజిమెంట్ల సంఖ్య ఇది.