అంతర్జాతీయం

‘ట్వీపుల్స్ లీడర్’ సుష్మా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 13: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ప్రముఖ ఫిలాంథ్రపిస్ట్ జంట వినీత్ నాయర్, అనుపమలు 2016 సంవత్సరానికి ప్రపంచ ఆలోచనాపరుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఫారిన్ పాలసీ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున పోటీ చేసిన హిల్లరీ క్లింటన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్, జెర్మన్ చాన్సలర్ అంజెలా మెర్కెల్, అమెరికా అటార్నీ జనరల్ లోరెట్టా లించ్ తదితరులు ఈ పత్రిక రూపొందించిన నిర్ణయాత్మక శక్తుల కేటగిరీలో స్థానం సంపాదించారు. వినూత్న విధానంలో ట్విట్టర్ దౌత్యాన్ని నిర్వహించి ‘కామన్ ట్వీపుల్ లీడర్’గా సుష్మా స్వరాజ్ పేరు తెచ్చుకున్నారని ఆ పత్రిక పేర్కొంది. సంపర్క్ ఫౌండేషన్ ద్వారా నాయర్ జంట భారత దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక విద్యావ్యవస్థను మార్చేందుకు పూనుకున్నారని పేర్కొంది. వాళ్లు సృష్టించిన స్మార్ట్ క్లాస్ కిట్‌ల ద్వారా ఒక్కో విద్యార్థికి కేవలం 70 రూపాయల వ్యయంలోనే ఈ కిట్‌ను అందజేస్తున్నారని పేర్కొన్నారు. కనీసం 50వేల పాఠశాలల్లో ఆధునిక విద్యాబోధన జరగాలన్నది నాయర్ జంట లక్ష్యమని ఫారిన్ పాలసీ సంచిక తెలిపింది. చత్తీస్‌గఢ్, జమ్ముకాశ్మీర్‌లలో వారు తమ కృషి సాగిస్తున్నారని వివరించింది. ఈ జాబితాలో మరికొందరు భారతీయులు కూడా స్థానం సంపాదించారు.