అంతర్జాతీయం

టైమ్స్ ప్రభావశీలుర జాబితాలో రాజన్, సానియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఏప్రిల్ 21: టైమ్స్ మ్యాగిజైన్ అంత్యంత ప్రభావశీలుర జాబితాలో ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, గూగుల్ సిఇవో సుందర్ పిచాయ్‌లకు చోటు దక్కింది. అలాగే వంద మంది ప్రభావవంతుల జాబితాలో ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్ పేర్లు చోటుచేసుకున్నాయి. టైమ్స్ వార్షిక జాబితా గురువారం విడుదల చేసింది. అమెరికన్ స్వరకర్త లీన్ మాన్యుల్- మిరండా, ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టీన్ లగార్డే, ఆస్కార్ అవార్డు గ్రహీత లియోనార్డో డికాప్రియోలు పేర్లు జాబితాలో ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక రంగం, కళలు, సామాజిక సేవ, క్రీడా రంగంలో విశేష కృషి చేసిన వారిని ఎంపిక చేస్తారు. ఆర్థికంగా ప్రపంచం అనేక ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపకుండా ఓ ఛోదకశక్తిగా ఆర్‌ఐబి గవర్నర్ రాజన్ పాత్రకు గుర్తింపుగా ఎంపిక చేశారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కృషి, పట్టుదల వర్ధమాన క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తాయని టైమ్స్ ప్రశంసించింది. దేశానికి ఆమె తీసుకొచ్చిన కీర్తిని గుర్తిస్తూ భారత్‌లోని ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేశారు. టైమ్స్ ప్రాబబుల్స్ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీకి చోటుదక్కినా ఫైనల్స్‌లో ఆయన పేరు చోటుచేసుకోలేదు. గత ఏడాది వంద మంది టైమ్స్ ప్రతిభాశీలుర జాబితాలో మోదీ నిలిచారు. కాగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థపాకులు బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్‌లకు జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.