అంతర్జాతీయం

ఘనంగా రాణి ఎలిజబెత్ జన్మదినం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 21: రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అత్యధిక కాలి ఏలిన మహారాణి ఎలిజబెత్-2 90వ జన్మదిన వేడుకలు బ్రిటన్, కామన్‌వెల్త్‌లలో వైభవంగా జరిగాయి. లండన్ శివార్లలోని విండ్సర్ భవంతిలో ఆమె వేడుకల్లో పాల్గొన్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామరాన్ నేతృత్వంలో పలువురు రాణికి అభినందనలు తెలిపారు. తమ దేశానికి ‘‘కొండలాంటి శక్తి (రాక్ ఆఫ్ స్ట్రెంగ్త్) అని కామరాన్ అభివర్ణించారు. రాణి కుమారుడు, ప్రిన్స్ చార్లెస్ తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక సందేశాన్ని రికార్డు చేసి రేడియో ద్వారా ప్రసారం చేశారు.
డేవిడ్ కామరాన్ తన సందేశంలో ‘గౌరవనీయురాలైన మహారాణి వారు తన జీవిత కాలంలో ప్రపంచంలోని అనేక ముఖ్య ఘట్టాలకు సాక్షీభూతంగా నిలిచారు. రెండో ప్రపంచ యుద్ధం, 1966లో వెంబ్లీలో ఇంగ్లండ్‌కు ప్రపంచకప్ ప్రదానం, ఆ తరువాత మూడేళ్లకు ఉత్తర ఐర్లాండ్‌లో అంతర్యుద్ధం ముగింపు.. ఆ తరువాత కొద్దికాలానికే చంద్రుడిపై మనిషి కాలుమోపడం.. వీటన్నింటితో పాటు సాంస్కృతిక, రాజకీయ పరిణామాల్లో కలిగిన మార్పులన్నిటినీ ఆమె చూశారు.
బ్రిటన్‌కీ, కామనె్వల్త్‌కి ఆమె ‘కొండలాంటి శక్తి’ అని ఆయన వివరించారు. యువ రాజకుటుంబంతో రాణి దిగిన ఫోటోతో పాటు 10 ప్రత్యేక స్టాంపులను బుధవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికార పరిధికే పరిమిత మైన రాణి పుట్టిన రోజు వేడుకలను జూన్ మొదటి వారంలో బకింగ్‌హమ్ ప్యాలెస్ వీధులతో సహా బ్రిటన్ అంతటా జరుగుతాయి.

చిత్రం తన 90వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బ్రిటన్ రాణి ఎలిజబెత్-2