అంతర్జాతీయం

ఇరాక్ యుద్ధంపై హిల్లరీ విచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 21: పదమూడేళ్ల క్రితం ఇరాక్‌పై యుద్ధానికి అమెరికా అనుకూలంగా ఓటేయటం పెద్ద పొరపాటని డెమొక్రాట్ల తరపున అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న హిల్లరీ క్లింటన్ తెలిపారు. ఆ సమయంలో హిల్లరీ సెనెటర్‌గా ఉన్నారు. ఇరాక్‌పై యుద్ధానికి నిర్ణయం తీసుకునే అధికారాన్ని అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌కు అప్పజెప్తూ ఓటేయటం పెద్ద తప్పిదమని ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఆరోజు ఆయన చెప్పిన దాని ప్రాతిపదికనే తాను ఆలోచించానని... అప్పుడు చేసింది పొరపాటేనని ఆమె అంగీకరించారు. 2016 సంవత్సరం వచ్చినప్పటికీ.. మగవారితో ఆడవాళ్లకు సమాన వేతనాలు ఇవ్వకపోవటం దురదృష్టమని ఆమె వ్యాఖ్యానించారు. మహిళలకు సమాన వేతనాలు ఇవ్వకపోయినట్లయితే.. అది వాళ్లను మోసం చేసినట్లేనని ఆమె స్పస్టం చేశారు. ‘నేను ఎనిమిదేళ్లు న్యూయార్క్ నుంచి సెనెటర్‌గా పనిచేశాను. ఇక్కడి ప్రజలునన్ను విశ్వసించారు. రెండు సార్లు ప్రైమరీల్లో నన్ను ఎన్నుకున్నారు. ఇచ్చి పుచ్చుకునే రాజకీయాల్లో మనం ఎక్కువ ఆకర్శితులమైనప్పుడు ఎక్కువ దాడులు కూడా ఎదురవుతుంటాయి’ అని ఆమె వివరించారు.