అంతర్జాతీయం

అంతా బాగుంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 19: ‘అంతా బాగుంటుంది.. మనం అందరం బాగుంటాం’ అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా చివరి మాటలివి. మరికొద్ది గంటల్లో డొనాల్డ్ ట్రంప్ 45వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో అమెరికన్లను ఉద్దేశించి ఒబామా మాట్లాడారు. రానున్న రోజుల్లో దేశం మరింత బాగుంటుందనే తాను విశ్వసిస్తున్నానని ఆయన అన్నారు.
అదే సమయంలో అమెరికా వౌలిక విలువల పరిరక్షణ విషయంలో రాజీ కూడదని ఆయన పిలుపునిచ్చారు. కొన్ని వర్గాలపై వివక్ష ప్రదర్శించటం, పత్రికా స్వేచ్ఛను అణచివేయటం, యువ ఇమ్మిగ్రెంట్లను లక్ష్యం చేసుకోవటం వంటి చర్యలు ఎంతమాత్రం తగవని ఆయన హితవు చెప్పారు. ‘నా వరకు నేను మంచి సలహా ఇచ్చాను. దేశీయ, విదేశీ అంశాలపై నా అభిప్రాయాలను వెల్లడించాను. ‘నా ఊహ ఏమిటంటే నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించటం, దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నా దృష్టి కోణాన్ని వ్యతిరేకించటం జరుగుతుంది. అయితే ఆయన (ట్రంప్) తన దృష్టికోణంతో, తనదైన వౌలిక విలువలతో విధులు నిర్వహించటం మంచిది. నా దృష్టిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు’ అని ఇబామా వ్యాఖ్యానించారు. ట్రంప్‌కు బాధ్యతలు అప్పగించిన తరువాత కొద్దికాలంపాటు ఏమీ మాట్లాడనని ఆయన అన్నారు. ‘కొద్దిగా రాయాలని ఉంది. కొంతకాలం పాటు ఏమీ మాట్లాడను. నన్ను నేను కూడా వినదలచుకోలేదు. నా విలువైన సమయాన్ని పిల్లలతో గడపాలని అనుకుంటున్నా’ అని ఒబామా తెలిపారు. సాధారణ రాజకీయాలు వేరు. అమెరికా విలువలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు వ్యవహరించాల్సిన తీరు వేరని ఆయన ట్రంప్‌కు హితవు చెప్పారు. నవంబర్ 8న ట్రంప్ గెలిచిన తరువాత మాట్లాడుతూ అమెరికాలోకి ముస్లింలను ప్రవేశించనివ్వకుండా నిషేధిస్తానని, అక్రమంగా దేశంలో ఉంటున్న వలసదారులను దేశంనుంచి బయటకు పంపిస్తానని ప్రకటించిన సంగతిని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఎవరిపట్లా వివక్ష కూడదని ఒబామా అన్నారు. ట్రంప్ గెలిచాక ఒబామాతో కలిసింది ఒకే ఒక్కసారి. ఇద్దరు నేతలు ఫోన్‌లో మాత్రం మాట్లాడుకున్నారు. అయితే ఆ విషయాలను తాను వెల్లడించనని ఒబామా పేర్కొన్నారు. అయితే ఆయన అధ్యక్ష పదవిలో కూర్చున్న తరువాత కానీ ఏం చేస్తారన్నది స్పష్టం కాదని పేర్కొన్నారు. తనచుట్టూ ఉండే సలహాదారులు ఆయన అభిప్రాయాలను ఖరారు చేస్తారని ఒబామా వ్యాఖ్యానించారు.