అంతర్జాతీయం

అమెరికా ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 20: అన్నింటా అమెరికా అగ్రదేశం కావాలన్నదే తన ఆశయం, ఆకాంక్ష అని కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. కేవలం పందొమ్మిది నెలల్లోనే రాజకీయ చరిత్రను తిరిగరాసి పగ్గాలు చేపట్టిన ట్రంప్ 45వ అధ్యక్షుడిగా శుక్రవారం లక్షలాది మంది సమక్షంలో పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని కష్టనష్టాలొచ్చినా అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా అమెరికాను ముందుకు తీసుకెళతానని ప్రతిజ్ఞ చేశారు. దేశ తొలి అధ్యక్షుడు అబ్రహం లింకన్ బైబిల్ సాక్షిగా ప్రమాణం చేసిన ట్రంప్ అమెరికాను బలంగా, సుసంపన్నంగా, సురక్షితమైన దేశంగా పునరుద్ధరించడానికి కలిసి పనిచేద్దాంమంటూ పిలుపునిచ్చారు. ఎవరి పట్ల ఎలాంటి వివక్ష ఉండదని, వర్ణమేదైనా అమెరికన్లలో ప్రవహించేది దేశ భక్తిరక్తమేనని ఉద్ఘాటించారు. ఈ జాతీయ భావనే దేశంలో అన్ని రకాల చీలికల్ని తొలగించి ఒక్కటిగా అమెరికాను ముందుకు నడిపిస్తుందన్నారు. ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే మనం కనే కలలు అంతకంటే ఉన్నతంగా ఉండాలని పేర్కొన్న ట్రంప్ తాను మాటలు చేప్పేవారిని దరిచేరనివ్వనన్నారు. ‘కేవలం శుష్క వాగ్దానాలతో కాలక్షేపం చేసే రోజులు పోయాయి. ఇది కార్యాచరణతో ముందుకెళ్లాల్సిన తరుణం’అని స్పష్టం చేశారు. దేన్నయినా అసాధ్యమని చెప్పేవారిని దరిచేరనివ్వద్దని హర్షధ్వానాల మధ్య ట్రంప్ పిలుపునిచ్చారు. దేశ భక్తే ప్రధానమైనప్పుడు ఎలాంటి ఈర్ష్యా ద్వేషాలకు ఆస్కారం ఉండదని..ఎలాంటి భయానికీ ఆస్కారం ఉండదని అన్నారు. ఐసిస్ ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు పౌర సమాజాన్ని ఏకం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ విష వృక్షాన్ని కూకటి వేళ్లతో పెకిలించివేస్తానని ట్రంప్ శపథం చేశారు. ఇందుకోసం పాత కూటములను పునరుద్ధరిస్తామని, కొత్త కూటములు ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. ఓ పక్క చలి వణుకు పుట్టిస్తున్నా దాదాపు 8లక్షల మంది ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ‘ఈ సువర్ణ శకం మీదే..వాషింగ్టన్ నుంచి అధికారాన్ని బదిలీ చేస్తున్నాం..దాన్ని మీకే అప్పగిస్తున్నాం’అంటూ ప్రజల్ని ఉద్దేశించి హర్షధ్వానాల మధ్య ట్రంప్ అన్నారు. ప్రజలే పాలకులైన రోజుగా జనవరి 20 చరిత్రలో మిగిలిపోతుందన్నారు. ఈ రోజు నుంచే అమెరికాలో కొత్త శకం ప్రారంభమవుతుందని అదే ‘అమెరికా ఫస్ట్..’అన్న ఆశయమని తెలిపారు. ఇప్పటి వరకూ జరిగిన పాలనలో రాజకీయ నాయకులే బాగుపడ్డారని, ఉద్యోగాలు మాత్రం పోయాయని తెలిపారు. ఆ ప్రభుత్వాలు తమను తాము కాపాడుకున్నాయే తప్ప దేశ పౌరుల ప్రయోజనాలను పరిరక్షించలేక పోయాయన్నారు. వారి విజయాలు ప్రజలు సాధించిన విజయాలుగా ఏ మాత్రం పరిగణించలేమన్నారు. అమెరికా పౌరులందరూ ఒక్కటేనని ఎవర్నీ విస్మరించేది లేదని తెలిపారు. అమెరికా ముందున్నది విజయాల పథమేనని, అదే మార్గంలో సరికొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకుపోతుందన్నారు. అమెరికా ఉద్యోగాలను కాపాడుకుంటామని, అమెరికా ప్రజలే దేశాన్ని నిర్మించుకుంటారని ట్రంప్ స్పష్టం చేశారు. ఇతర దేశాల ప్రయోజనాల కోసం ట్రిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేశారని, కానీ ఆ మేరకు అమెరికా నష్టపోయిందన్నారు. ఇలాంటి విధానాల వల్ల అమెరికాలో వేలాది పరిశ్రమలు మూత పడ్డాయని, ఉద్యోగాలనూ కోల్పోయామని గుర్తు చేసిన ట్రంప్ ఇక వచ్చేవన్నీ మంచి రోజులేనని, అందరి భాగస్వామ్యంతో ముందుకు దూసుకుపోదామని పిలుపునిచ్చారు.