అంతర్జాతీయం

పిలిస్తే పలుకుతా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 20: అమెరికా అధ్యక్షుడిగా పదవీ విరమణ చేస్తున్నప్పటికీ ప్రతిదశలోనూ వారికి సేవలు అందించేందుకు అందుబాటులో ఉంటానని బరాక్ ఒబామా స్పష్టం చేశారు. తనను ఉత్తమ రీతిలో విధులు నిర్వహించేలా తీర్చిదిద్దినందుకు, అన్ని విధాలుగా తోడ్పాటును అందించినందుకు దేశ ప్రజలకు భావోద్వేగ రీతిలో ఓ లేఖ రాశారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో తనను మంచి అధ్యక్షుడిగానే కాకుండా మంచి వ్యక్తిగా అమెరికన్లు తీర్చిదిద్దారని అందుకు వారికి రుణపడి ఉంటానని అన్నారు.‘ ఈ ఎనిమిదేళ్లలో నేను ఏం చేసినా అదంతా మీ చలవే. సుహృద్భావం, ఓరిమి, పట్టుదల, ఆశ, ఆకాంక్ష ఇవన్నీకూడా మీరు నాకు అందించినవే. వీటి నుంచే నేను ఎప్పటికప్పడు కొత్త శక్తిని పొందాను. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభ సమయంలో దేశ ప్రజలందరూ ఒక్కటిగా నిలబడి దేశాన్ని నిలబెట్టారు’అన ఆ లేఖలో ఒబామా పేర్కొన్నారు. తన హయాంలో జరిగిన అనేక విద్వేష ఘటనలను, ఉన్మాద కృత్యాలను కూడా ఒబామా లేఖలో ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్షుడికి వీడ్కోలు లేఖను అందించడానికి ముందే తాను అమెరికా ప్రజలకు ఈ కృతజ్ఞతా సందేశాన్ని ఇస్తున్నానని ఆయన తెలిపారు. ప్రతిరంగానికి చెందిన నిపుణులు అమెరికా ఉన్నతికి అలాగే దాని బాగుకోసం అహరహం శ్రమించారని వారందరి నుంచి పొందిన స్పూర్తి దేశాధ్యక్షుడిగా మరిన్ని ఉన్నత ప్రమాణాలు పాదుగొల్పాలన్న ఆకాంక్షను తనలో కలిగించిందన్నారు. శాస్తవ్రేత్తలు, సైనికులు, వైద్యులు, సాంకేతిక నిపుణులు ఇలా ప్రతి ఒక్కరూ కూడా అమెరికా ప్రగతి గతిని తీర్చిదిద్దినవారేనని ఒబామా స్పష్టం చేశారు. ముఖ్యంగా శరణార్ధులను అమెరికా చిన్నారులు ఆదుకున్న సంఘటన తనకు చిరస్మరణీయమైందని తెలిపారు. అమెరికా ప్రజల్లో ఎంతగా పట్టుదల ఉందో అంతా సుహృద్భావం, ఎదుటివారికి తోడ్పడాలన్న తమన ఉన్నాయంటూ కితాబు ఇచ్చారు. అమెరికా ఇంత సమున్నత దేశంగా ఎదిగిందంటే దానికి ఏ ఒక్క వ్యక్తికారణం కాదని దేశ ప్రజాస్వామ్యంలో లిఖించుకున్న‘మనం’ అన్న మాటే అమెరికా బలానికి, ఐక్యతకు తార్కాణమని అన్నారు. అమెరికా 44వ అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ లేఖలో ఉటంకించిన ఒబామా అమెరికా వేసే ప్రతి అడుగులోనూ తాను ఉంటానని ప్రతిజ్ఞ చేశారు.