అంతర్జాతీయం

ట్రంప్ మాకొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 20: అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం వేలాది మంది నిరసనల మధ్య జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వాషింగ్టన్‌కు తరలి వచ్చిన జనం ఆ ప్రాంతాన్ని నిరసనలు, ట్రంప్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కొత్త ప్రభుత్వం విచ్ఛిన్నకర విధానాలను అవలంబిస్తోందంటూ ఆక్రోషించారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు మిరియాల పొడిని చల్లాల్సి వచ్చింది. ఇంకొన్ని చోట్ల బాష్పవాయు గోళాలనూ ప్రయోగించారు. ఓ నిరసనకారుడైతే ట్రంప్ టోపీని దగ్ధం చేశాడు. కొత్త అధ్యక్షుడు మాకొద్దంటూ నినాదాలూ మార్మోగాయి. శుక్రవారం ఉదయం నుంచి వివిధ రకాల ట్రంప్ వ్యతిరేక బ్యానర్లతో జనం వాషింగ్టన్ చేరుకున్నారు. కొన్ని నిరసన బృందాలైతే ప్రమాణ స్వీకారం జరిగే వైట్‌హౌస్ ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నమూ చేశాయి.
మెజార్టీ అమెరికన్లు వ్యతిరేకం
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఆయన మద్దతుదారులు నిర్వహించనున్న వేడుకలను ఆ దేశంలోని 51 శాతం మంది ప్రజలు ప్రజాస్వామ్య ఉత్సవంగా కాకుండా రాజకీయ ఉత్సవంగా పరిగణిస్తున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు నిర్వహించిన తమ సర్వేలో ఈ విషయం తేలిందని ‘గ్యాలప్’ వెల్లడించింది.
ఎనిమిదేళ్ల క్రితం అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ప్రమా ణ స్వీకారం చేసినప్పుడు దానిని చారిత్రక ఘట్టంగా పరిగణించి అమెరికన్లంతా వేడుకలు జరుపుకున్నారని, అయితే వీరిలో ఇప్పుడు ఎక్కువ మంది ట్రంప్ ప్రమాణ స్వీకారాన్ని పక్షపాతంతో కూడిన కార్యక్రమంగా పరిగణిస్తున్నారని, 51 శాతం మంది అమెరికన్లు దీనిని ప్రజాస్వామ్య ఉత్సవంగా కాకుండా రాజకీయ ఉత్సవంగా భావిస్తున్నారని ‘గ్యాలప్’ పేర్కొంది.

ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా నిరసన తెలియజేస్తున్న దృశ్యం