అంతర్జాతీయం

బంగారు మరుగుదొడ్డి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఏప్రిల్ 22: బంగారు ఉంగరాలు, బ్రాస్లెట్లు.. ఇలా అంటుంటాం కాని, బంగారు మరుగుదొడ్డి అంటామా? అవును ఇప్పుడు అనాల్సిందే మరి. ఎందుకంటే ఇది పూర్తిగా బంగారంతో తయారుచేసిన మరుగుదొడ్డి. 18 క్యారట్ల బంగారంతో తయారు చేసిన మరుగుదొడ్డిని అమెరికాలోని గుగెన్‌హెయిమ్ మ్యూజియం బాత్‌రూమ్‌లో బిగించడానికి రంగం సిద్ధమైంది. మ్యూజియంలో పెడుతున్నారంటే కేవలం చూడటానికి అనుకుంటున్నారేమో. అదేం కాదు, పేద, ధనిక తేడా లేకుండా మ్యూజియంను సందర్శించే ఎవరైనా బాత్‌రూమ్‌లోకి వెళ్లి, లోపలివైపు గడియ పెట్టుకొని ఈ బంగారు టాయ్‌లెట్‌ను ఉపయోగించుకోవచ్చని గగెన్‌హెయిమ్ మ్యూ జియం ప్రచారకర్త (పబ్లిసిస్ట్) మోలీ స్టివార్ట్ ‘న్యూయార్క్ డైలీ న్యూస్’కు చెప్పారు.