అంతర్జాతీయం

కాశ్మీరీల పోరాటానికి మరింత ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జనవరి 31: తనను పాకిస్తాన్ ప్రభుత్వం గృహనిర్బందంలో ఉంచడంపై ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన సూత్రధారి, జమాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు హఫీజ్ సరుూద్ తీవ్రంగా స్పందించారు. తనను గృహనిర్బంధంలో ఉంచడం వల్ల కాశ్మీర్‌లో జరుగుతున్న స్వాతంత్య్ర పోరాటాన్ని అదుపు చేయవచ్చని ఎవరైనా భావిస్తూ ఉంటే అది పగటి కలేనని, ఇది భారత్‌కు వ్యతిరేకంగా కాశ్మీరీలు జరుపుతున్న పోరాటానికి మరింత ఊపులభిస్తుందని అన్నారు. అంతేకాదు తన అరెస్టుకు ఆదేశాలు ఇస్లాబాద్‌నుంచి రాలేదని, వాషింగ్టన్‌నుంచి వచ్చాయని కూడా ఆయన అన్నారు. సోమవారం రాత్రి గట్టి పోలీసు భద్రత మధ్య పెద్దసంఖ్యలో మద్దతుదారులతో కలిసి లాహోర్‌లోని తన నివాసానికి వెళ్లడానికి ముందు హఫీజ్ సరుూద్ విలేఖరులతో మాట్లాడారు.
హఫీజ్ సరుూద్‌తోపాటుగా జమాత్ ఉద్ దలా, ఫలాహా ఇ-ఇన్సానియత్ సంస్థలకు చెందిన మరో నలుగురు నేతలను ప్రభుత్వం 90 రోజులపాటు గృహనిర్బంధంలో ఉంచిందని, అయితే అవసరమైన పక్షంలో ఈ గడువు ముగిసిన తర్వాత గృహనిర్బంధాన్ని పొడిగించవచ్చని పంజాబ్ హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. హఫీజ్‌ను అదుపులోకి తీసుకోవడంపై పాక్‌లోని ప్రధాన నగరాల్లో ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలు దిగారు. లాహోర్‌తోపాటుగా ఇస్లామాబాద్, కరాచీల తదితర నగరాల్లో పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన నిరసనకారులు భారత్‌కు, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్ర అధికారులు లాహోర్‌లో జమాత్ ఉద్ దవా బ్యానర్లను, జెండాలను తొలగించడం ప్రారంభించారు. లాహోర్‌లోని జెయుడి కార్యాలయంపై పార్టీ జెండాను తొలగించి దాని స్థానంలో జాతీయ పతాకాన్ని ఎగురువేశారు. హఫీజ్ సరుూద్ నిర్బంధంపై భారత్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించనప్పటికీ ఆయన అరెస్టుతో భారత్, పాక్‌ల మధ్య ఉదిక్తతలు గణనీయంగా తగ్గుతాయని ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక వ్యాఖ్యానించింది.

చిత్రం..తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతున్న హఫీజ్ సయాద్