అంతర్జాతీయం

ఎవరి వైఖరి వారిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రసెల్స్, మార్చి 31: నాలుగేళ్ల క్రితం కేరళకు చెందిన ఇద్దరు మత్స్యకారులను ఇద్దరు ఇటలీ నావికులు కాల్చి చంపిన కేసులో ఒక అంగీకారానికి రావడంలో భారత్, యూరోపియన్ యూనియన్ విఫలమయ్యాయి.
మృతుల కుటుంబాలకు న్యాయం చేకూర్చాల్సిన అవసరం ఉందని భారత్ పట్టుబడుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూరోపియన్ యూనియన్ నాయకుల మధ్య బుధవారం రాత్రి ఇక్కడ జరిగిన 13వ ఇండియా-ఇయు శిఖరాగ్ర సమావేశం అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తమ నావికుల కేసుకు వేగవంతమైన పరిష్కారం కనుక్కోవడానికి ఇటలీ పడుతున్న ఆందోళనను ఇయు పంచుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇరు పక్షాలు ఎవరి వైఖరికి వారు గట్టిగా కట్టుబడి ఉన్నాయి. అయితే ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ కనె్వన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ (యుఎన్‌సిఎల్‌ఒఎస్) చట్రంలో ఉన్న ఈ కేసు మధ్యవర్తిత్వ ప్రక్రియ ద్వారా పరిష్కారం అవుతుందన్న విశ్వాసాన్ని ఇరు పక్షాలు తమ సంయుక్త ప్రకటనలో వ్యక్తం చేశాయి. యుఎన్‌సిఎల్‌ఒఎస్‌కు ఇటు భారత్, అటు ఇటలీ గట్టిగా కట్టుబడి ఉన్నాయి. భారత్ అదుపులో ఉన్న తమ నావికుడు సాల్వటోర్ గిరోనేను విడుదల చేయాల్సిందిగా ఆ దేశాన్ని ఆదేశించాలని హేగ్‌లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (పిసిఎ)ను కోరిన రోజే ఈ సంయుక్త ప్రకటన విడుదల అయింది.