అంతర్జాతీయం

భారత కాల్ సెంటర్‌ను ఎగతాళి చేసిన ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 23: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్ వచ్చీరాని భారతీయ యాసతో ఆంగ్లం లో మాట్లాడుతూ భారత్‌లోని ఒక కాల్ సెంటర్ ప్రతినిధిని ఎగతాళి చేశారు. అమెరికాలోని డెలవేర్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ భారత్ గొప్ప దేశమని, భారతదేశ నేతలపై తనకు ఎలాంటి కోపం లేదని ఆయన స్పష్టం చేశారు. తన క్రెడిట్ కార్డ్ కంపనీకి చెందిన కస్టమర్ సపోర్ట్ అమెరికాలో ఉందా? మరో దేశంలో ఉందా? అనే విషయం తెలుసుకోవడానికి సదరు కంపనీకి ఫోన్ చేసినట్లు ట్రంప్ చెప్పారు. ‘మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?’ అని తాను అడిగానని చెప్పారు. అయితే ‘వి ఆర్ ఫ్రమ్ ఇండియా’ (మేము భారత్‌నుంచి మాట్లాడుతున్నాము) అని సదరు కాల్ సెంటర్ ప్రతినిధి చెప్పారని ట్రంప్ తెలిపారు. ఆ కాల్ సెంటర్ ప్రతినిధి చెప్పిన మాటలను వచ్చీరాని భారతీయ యాసలో తన మద్దతుదారులకు ట్రంప్ చెబుతూ ఎగతాళి చేశారు. అయితే ‘్భరత్ గొప్ప దేశం. ఇతర దేశాల నాయకులపై నాకు ఎలాంటి ఆగ్రహం లేదు. నా ఆందోళనంతా మన తెలివిమాలిన నాయకుల గురించే’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చైనా, జపాన్, వియత్నాం, భారత్‌లపై తనకు ఎలాంటి ఆగ్రహం లేదని స్పష్టం చేశారు.