అంతర్జాతీయం

అఫ్గాన్ దౌత్యాధికారి కాల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఫిబ్రవరి 6: అఫ్గాన్‌కు చెందిన ఓ దౌత్యవేత్తను సెక్యురిటీ గార్డే కాల్చి చంపేశాడు. పాక్ పోర్ట్‌సిటీ కరాచీలోని ఆఫ్గనిస్తాన్ కాన్సులేట్ వద్దే ఈ దారుణం చోటుచేసుకుంది. ఆఫ్గనిస్తాన్ దౌత్యాధికారి జాకీ అదు అనే దౌత్యాధికారిని ప్రైవేటు సెక్యురిటీ గార్డు హైతుల్లా ఖాన్ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగిందని కోపంతో గార్డు ఈ ఘాతుగానికి పాల్పడినట్టు డిఐజి (సౌత్) ఆజాద్‌ఖాన్ మీడియాకు వెల్లడించారు. అత్యంత భద్రత ఉంటే క్లిఫ్టోన్ ప్రాంతంలో కాన్సులేట్ కార్యాలయం ఉంది. ‘ఈ ఘటనను తీవ్రవాద కోణంలో చూడలేం. ఇద్దరి మధ్య జరిగిన వాగ్వివాదమే కాల్పులకు దారితీసింది’ అని ఆయన స్పష్టం చేశారు. అధికారితో గొడవపడ్డ హైతుల్లా సంయమనం కోల్పోయి కాల్పులు జరిపాడని డిఐజి పేర్కొన్నారు. సిసిటివి ఫుటేజ్ పరిశీలిస్తున్నామని అలాగే ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు ఆజాద్‌ఖాన్ వెల్లడించారు. కాల్పుల్లో చనిపోయిన దౌత్యాధికారి ఆఫ్గన్ నార్త్‌ప్రొవిన్స్ బాల్ఖ్ ఎంపీ మహ్మద్ అబ్దుల్ సోదరుడు. క్లిఫ్టోన్ ప్రాంతంలో అనేక దేశాల కాన్సులేట్‌లు ఉన్నాయి. అదే ప్రాంతంలో భుట్టో కుటుంబాలు నివసిస్తున్నాయి. గార్డు హైతుల్లాను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

చిత్రం..కరాచీలోని ఆఫ్గనిస్తాన్ కాన్సులేట్ వద్ద అప్రమత్తమైన పాక్ జవాన్లు