అంతర్జాతీయం

‘హామ్లెట్’ నాటకం చూసిన ఒబామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 23: ప్రముఖ నాటక రచయిత విలియమ్ షేక్స్‌పియర్ 400వ వర్ధంతి సందర్భంగా బ్రిటన్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శనివారం లండన్‌లోని షేక్స్‌పియర్‌కు చెందిన గ్లోబ్ థియేటర్‌ను సందర్శించారు.
ఒబామా గౌరవార్థం రాయల్ షేక్స్‌యర్ కంపెనీ ఆయన రాసిన ‘హామ్లెట్ ’నాటకాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించింది కూడా. షేక్స్‌పియర్ 400వ వర్ధంతి సందర్భంగా శనివారం దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు, కళాకారులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలులాంటి పలు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

చిత్రం లండన్ గ్లోబ్ థియేటర్‌లో శనివారం షేక్స్‌పియర్ రాసిన
‘హామ్లెట్ ’ నాటకాన్ని తిలకిస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా